అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది.ఈ మేరకు తదుపరి విచారణను ఏపీ హైకోర్టు ఈనెల 12కు వాయిదా వేసింది.
పిటిషన్ పై విచారణలో భాగంగా సీఐడీ న్యాయస్థానాన్ని కొంత సమయం కావాలని కోరింది.దీంతో విచారణను వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది.
కాగా ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు తరపు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.మరోవైపు స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో రెగ్యులర్ బెయిల్ మంజూరు కావడంతో చంద్రబాబు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.







