ఏపీలో వాలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బందిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలన్న పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది.ఈ మేరకు సిటిజన్ ఫర్ డెమోక్రసీ సంస్థ ఈ పిటిషన్ ను దాఖలు చేసింది.
వాలంటీర్ వ్యవస్థ మాటున ఎన్నికలను ప్రభావితం చేసే కుట్ర జరుగుతోందని సిటిజన్ ఫర్ డెమోక్రసీ సంస్థ ఆరోపించింది.వాలంటీర్ వ్యవస్థ ఏపీలో ఎన్నికల అక్రమాలకు తావిచ్చేలా ఉందని, ఈ క్రమంలో ఆ వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని సంస్థ సుప్రీంకోర్టును కోరింది.
వైసీపీ కార్యకర్తలనే ప్రభుత్వం వాలంటీర్లుగా నియమించిందని పేర్కొంది.వాలంటీర్ల వ్యవస్థ వలన ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతోందన్న సిటిజన్ ఫర్ డెమోక్రసీ సంస్థ వాలంటీర్లు సమాచారం మొత్తాన్ని వైసీపీ సభ్యులకు అందిస్తున్నారని పేర్కొంది.
ఈ క్రమంలోనే ఏపీలో భారీగా ఓట్ల తొలగింపు జరిగిందని ఆరోపించింది.ఈ నేపథ్యంలోనే వాలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బందిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని న్యాయస్థానాన్ని కోరింది.







