కృష్ణా జలాల పంపిణీ వివాదంపై సుప్రీంకోర్టులో( Supreme Court ) విచారణ జరిగింది.మరో ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలన్న కేంద్రం గెజిట్ ను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దేశ అత్యున్నత న్యాయస్థానంలో సవాల్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో పిటిషన్ పై విచారణను సుప్రీం ధర్మాసనం ఏప్రిల్ 30వ తేదీకి వాయిదా వేసింది.అయితే కృష్ణా జలాల వివాదాల పరిష్కార ట్రైబ్యునల్ -2 ద్వారా ఏపీ, తెలంగాణ మధ్య నీటి పంపిణీకి నూతన విధివిధానాల ఖరారుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
ఇటీవల బచావత్ ట్రిబ్యునల్ తీర్పు( Judgment of Bachawat Tribunal ) వెలువడిన క్రమంలో రెండు రాష్ట్ర మధ్య జలాల పంపిణీ కోసం మరో ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలనే సెంట్రల్ నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది.







