ఎమ్మెల్యే దానం నాగేందర్ పై( MLA Danam Nagendar ) అనర్హత వేటు వేయాలన్న పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.ఈ క్రమంలో రాజు యాదవ్( Raju Yadav ) పిటిషన్ విచారణ అర్హతపై వాదనలు నడిచాయి.
ఓటర్ గా ఉండి ఎమ్మెల్యేను డిస్ క్వాలిఫై చేయాలని కోరడంపై న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేసింది.
దానం నాగేందర్ కు బీఆర్ఎస్ బీ-ఫామ్( BRS B-Form ) ఇచ్చింది కాబట్టి వారికి అభ్యంతరం ఉండాలని పేర్కొంది.
ఈ అంశంలో స్పీకర్ కు తాము ఆదేశాలు ఇవ్వలేమని తెలంగాణ హైకోర్టు( Telangana High Court ) తెలిపింది.పిటిషన్ అర్హతపై తదుపరి విచారణలో చూస్తామని వెల్లడించింది.