కొత్త టోల్ పాలసీ గురించి విన్నారా? ఇక వాహనాలను అమ్మేసుకోవలసిందే?

అవును, ఇపుడు చెప్పబోయే టోల్ పాలసీ( Toll Policy ) గురించి విన్నారంటే బక్కబోర్లా పడతారు.విషయం ఏమంటే ఇకనుండి ‘పే పర్ రోడ్ యూజ్‘( Pay per road use ) టోల్ వసూలు విధానాన్ని ప్రవేశ పెట్టబోతున్నారు.

 Heard About The New Toll Policy Do You Have To Sell Vehicles ,toll Policy, Vehic-TeluguStop.com

అంటే దీనర్ధం ఏమంటే రోడ్డుపై మీరు ఎంత దూరం ప్రయాణిస్తే, ఆ మేరకు టోల్ కట్టవలసి ఉంటుంది.అవాక్కవుతున్నారు కాదూ.

మీరు విన్నది నిజమే.నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా దీనిపై తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది.

ఎక్స్‌ప్రెస్ వేపై ప్రయాణించిన దూరం ఆధారంగా ఈ టోల్ ట్యాక్స్‌ కలెక్ట్ చేయనున్నారు.తరువాత ఈ మార్గాన్ని ‘ఓపెన్ టోల్ రోడ్’ ఎక్స్‌ప్రెస్ వేగా మార్చనున్నారు.

Telugu Anpr Cameras, Delhi, Gurgaon, Indian, Latest, Pay Road, Toll Policy, Vehi

ఇంతకీ ఈ విధానం ఎక్కడ ప్రవేశపెట్టనున్నారంటే… ఢిల్లీ, గుర్‌గావ్( Delhi, Gurgaon ) నగరాలను కలుపుతూ ప్రభుత్వం నిర్మించిన ఢిల్లీ-గుర్‌‌గావ్ ఎక్స్‌ప్రెస్ వేపైన.ఈ మేరకు ఢిల్లీ- గుర్‌గావ్ ఎక్స్‌ప్రెస్ వేపై ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రీడింగ్ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు యాన్ హెచ్ ఏ ఐ అధికారులు వెల్లడించారు.ఎక్స్‌ప్రెస్ వేపై అన్ని ప్రవేశ, నిష్క్రమణ(ఎంట్రీ, ఎగ్జిట్) ద్వారాల వద్ద ఈ ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రీడింగ్ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు తాజా ప్రకటనలో పేర్కొన్నారు.ఈ క్రమంలో దాదాపు 29 కిలోమీటర్ల పొడవైన ఎక్స్‌ప్రెస్ వేపై కిలోమీటర్ల ఆధారంగా టోల్ ట్యాక్స్‌ని లెక్కించి వినియోగదారుల ఫాస్టాగ్ నుంచి ఆటోమేటిక్‌గా డిడక్ట్ చేసుకుంటుంది.

Telugu Anpr Cameras, Delhi, Gurgaon, Indian, Latest, Pay Road, Toll Policy, Vehi

ఈ నేపథ్యంలో ఎన్‌హెచ్ఏఐ అధికారి ఒకరు మాట్లాడుతూ… ‘ఎక్స్‌ప్రెస్ వేపై ANPR కెమెరాల ఏర్పాటుకు టెండర్ల ప్రక్రియ మొదలైంది’ అని తెలిపారు.అంతేకాకుండా వచ్చే 6 నెలల్లో ‘పే పర్ రోడ్ యూజ్’ వ్యవస్థను అమలు చేయనున్నట్లు ఎన్‌హెచ్ఏఐ సీనియర్ మేనేజర్ అయినటువంటి ధ్రువ్ గుప్తా వెల్లడించారు.ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చాక ఖేర్కి- డౌలా టోల్ ప్లాజాను ఎత్తివేయడంపై ఎన్‌హెచ్ఏఐ నిర్ణయం తీసుకుంటుందని ధ్రువ్ గుప్తా ఈ సందర్భంగా స్పష్టం చేశారు.ఇకపోతే ANPR కెమెరాల ఏర్పాటు ప్రతిపాదనను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గతేడాదే తీసుకొచ్చారు.

ద్వారకా ఎక్స్‌ప్రెస్ వేపై త్వరలోనే ప్రవేశపెడతామని గతంలో వెల్లడించడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube