సపోటాతో హెల్తీ స్మూతీ.. వారానికి 2 సార్లు తీసుకుంటే ఊహించని ఆరోగ్య లాభాలు మీ సొంతం!

అద్భుతమైన రుచిని కలిగి ఉండే పండ్లలో సపోటా( Sapota ) ఒకటి.రుచి పరంగానే కాదు సపోటాలో ఎన్నో విలువైన పోషకాలు సైతం నిండి ఉంటాయి.

 Healthy Smoothie With Sapota For Amazing Benefits!, Healthy Smoothie, Sapota, Ch-TeluguStop.com

అందుకే ఆరోగ్యపరంగా సపోటా అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది.అందులోనూ సపోటాతో ఇప్పుడు చెప్పబోయే విధంగా స్మూతీ ని తయారు చేసుకుని వారానికి కనీసం రెండు సార్లు తీసుకుంటే మీరు ఊహించని ఆరోగ్య లాభాలు మీ సొంతం అవుతాయి.

మరి ఇంకెందుకు ఆలస్యం సపోటాతో హెల్తీ స్మూతీ( healthy Smoothie )ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

Telugu Chikoo Fruit, Chikoo Smoothie, Tips, Latest, Sapota, Sapota Benefits-Telu

ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు రాగి ఫ్లేక్స్ వేసుకుని మంచిగా వేయించుకోవాలి.ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో ఒక కప్పు సపోటా పల్ప్( Sapota Pulp ), ఐదు నుంచి ఆరు నైట్ అంతా వాటర్ లో నానబెట్టుకున్న జీడిపప్పు, వన్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్, వన్ టేబుల్ స్పూన్ అవిసె గింజలు, హాఫ్ టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసుకోవాలి.చివ‌రిగా మూడు గింజ తొలగించిన ఖర్జూరాలు( Dates) మ‌రియు ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రాగి ఫ్లేక్స్( Ragi Flakes ) వేసుకుంటే మన స్మూతీ సిద్ధం అయినట్టే.ఈ స్మూతీ టేస్ట్ గా ఉండడమే కాదు హెల్త్ కి చాలా మంచిది.

వారానికి క‌నీసం రెండు సార్లు ఈ స్మూతీని తీసుకుంటే వెయిట్ లాస్ అవుతారు.నిద్రలేమి దూరం అవుతుంది.ఎముకలు, కండరాలు దృఢంగా మారతాయి.

Telugu Chikoo Fruit, Chikoo Smoothie, Tips, Latest, Sapota, Sapota Benefits-Telu

అంతేకాదు, ఈ స్మూతీని డైట్ లో చేర్చుకోవ‌డం వ‌ల్ల‌ రోగనిరోధక వ్యవస్థ( Immunity Power ) బలపడుతుంది.కిడ్నీలో రాళ్లు కరుగుతాయి.నీరసం, అలసట వంటివి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.

శరీరం ఫుల్ ఎనర్జిటిక్ గా మారుతుంది.జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

గర్భిణీలకు మరియు పాలిచ్చే తల్లులకు కూడా ఈ స్మూతీ ఎంతో మేలు చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube