పెరుగు మంచిదండి .. ఎందుకంటే!

కాస్త ఎండ ఎక్కువగా తగిలిందనుకోండి .మన ప్రమేయం లేకుండానే, గట్టిగా అలోచించకుండానే పెరుగుతో చేసిన పానీయం ఏదైనా తాగాలనిపిస్తుంది.

 Healthy Benefits Of Curd-TeluguStop.com

ఎంత ఇష్టమైమ కూరతో తిన్నా, భోజనాన్ని పెరుగుతో ముంగించకపోతే ఏదో తెలియని అసంతృప్తి మిగిలిపోతుంది.పెరుగుకి ఉన్న ప్రాధాన్యతే అది.బట్టర్ మిల్క్, లస్సి .తాగే పద్ధతి ఏదైనా, పెరుగు శరీరానికి చాలావిధాలుగా మంచి చేస్తుంది.పెరుగు అందించే ప్రయోజనాలు కొన్ని ఇప్పుడు తెలుసుకోండి.

* పెరుగు వలన జీర్ణశక్తి పెరుగుతుంది.

జీర్ణక్రియ మెరుగుపడుతుంది.అందుకే మనకు పెద్దగా కారణం తెలియకపోయినా, భోజనాన్ని పెరుగుతో ముగిస్తూ ఉంటాం.

* అల్సర్ తో బాధపడేవారికి పెరుగు మంచి ఔషధంలా పనిచేస్తుంది.మంటను తగ్గించడమే కాకుండా, సమస్యను త్వరగా తరిమేసేందుకు ఉపయోగపడుతుంది.

* పెరుగు బాడిలోని హీట్ ని తగ్గిస్తుంది.అందుకే ప్రతీ వేసవి కాలం, మనం మజ్జిగ, లస్సి లాంటి వాటి మీద ఎక్కువగా ఆధారపడుతుంటాం.

* పెరుగులో కాల్షియం బాగా దొరుకుతుంది.తద్వారా ఉదర సంబంధిత సమస్యలు ఎన్నిటినో మనం నయం చేసుకోవచ్చు.

* పెరుగు చర్మ సౌందర్యానికి ఎంతో మంచిది.పెరుగులో తేనే కలిపి రోజూ ముఖానికి రాసుకుంటే రకరకాల చర్మ సమస్యల నుంచి కాపాడుకోవడమే కాదు, ముఖాన్ని కాంతివంతంగా తయారుచేసుకోవచ్చు.

* పెరుగులో వాము కలుపుకోని తినడం వలన మలబద్ధకం నుంచి విముక్తి పొందవచ్చు.

* నిస్సరంగా ఉన్న మెదడుకి ఉత్తేజాన్ని కలిగించే శక్తి పెరుగుకి ఉన్నట్లు పరిశోధనలు తేల్చిచెప్పాయి.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు