క్యారట్ ఈ భూమికి ఒక అద్భుతమైన వరం.ఫైటో కెమికల్, విటమిన్ ఏ, విటమిన్ సి, ఫైబర్ .
అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే క్యారట్ అద్భుతాల నిధి.ఇలాంటి క్యారట్ మార్కెట్లో చీప్ గా దొరికినా పట్టంచుకోవట్లేదు చాలామంది.
రోజుకో గ్లాసు క్యారట్ జ్యూస్ తాగండి.ఎందుకు తాగాలో చదివి తెలుసుకోండి.
* ఆడవారు క్యారట్ జ్యూస్ తాగడం తప్పకుండా అలవాటు చేసుకోవాలి.దీని వలన ప్లాస్మా కెరొటినాయిడ్‌లు మెరుగుపడతాయి.
రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలావరకూ తగ్గుతుంది.
* క్యారట్ లో విటిమిన్ ఏ పుష్కలంగా దొరుకుతుంది.
ఇందులో బిటా కెరోటిన్ కుడా లభిస్తుంది.ఇవి కంటికి చాలా ఉపయోగకరం.
కనులని ఆరోగ్యంగా ఉంచి, కంటి చూపుని మెరుగుపరుస్తాయి.
* క్యారట్ ముఖసౌందర్యానికి కూడా మంచిది.
ఇందులో దొరికే యాంటిఆక్సిడెంట్స్, పొటాషియం కొత్త కణాలు పుట్టుకురావడానికి సహాయపడతాయి.మృతకణాలు పోయి, చర్మం అందంగా తయారవుతుంది.
* క్యారట్ గుండెని ఆరోగ్యంగా ఉంచుతుంది.ఇది సిస్టోలిక్ ప్రెజర్ ని తగ్గిస్తుంది.
* డయాబెటిస్ ని అడ్డుకునేందుకు కూడా క్యారట్ ఉపయోగపడుతుంది.ఇందులో దొరికే మినరల్స్ శరీరానికి ఎంతో మేలుచేస్తాయి.
బ్లడ్ షుగర్ లెవెల్స్ ని అదుపులో ఉంచుతుంది క్యారట్.
* రోజూ ఓ గ్లాసు క్యారట్ జ్యూస్ తాగండి.
రోగనిరోధకశక్తికి ఇది మేలు చేస్తుందో మీరే తెలుసుకుంటారు.
* క్యారట్ లో ఐరన్, విటమిన్ సి దొరుకుతాయి.
శాకాహారుల్లో ఉండే అనీమియా లోపం క్యారట్ ద్వారా కవర్ చేయవచ్చు.
* క్యారట్ లో పొటాషియం, ఫాస్పరస్, విటమిన్ బి6 కూడా లభిస్తాయి.
బలమైన నరాల వ్యవస్థకు, బలమైన ఎముకలు, చురుకైన మెదడు పొందడానికి క్యారట్ గొప్ప సాధనం.
* ఇంతే కాదు.
క్యారట్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.అర్థరైటిస్ వంటి డిజార్డర్ తో పోరాడుతుంది.
మలబద్ధకం, శ్వాస సంబంధిత సమస్యలు, ఎసిడిటి వంటి చిక్కులను దూరం చేస్తుంది.







