అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళల కోసం ఆరోగ్య మహిళ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది.
కరీంనగర్ జిల్లాలో ఈ పథకానికి ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు శ్రీకారం చుట్టారు.ఈ స్కీంలో ఎనిమిది రకాల చికిత్సలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
ఆరోగ్య మహిళ పథకం కింద వంద ఆస్పత్రులు ఏర్పాటు చేసామని ప్రకటించారు.ఆరోగ్య మహిళా కేంద్రాల్లో మహిళా సిబ్బంది మాత్రమే ఉంటారని స్పష్టం చేశారు.







