మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల అయింది.ఈ మేరకు యశోద ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ ను విడుదల చేశారు.
కేసీఆర్ కు ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు విశ్రాంతి అవసరం అని వైద్యులు హెల్త్ బులిటెన్ లో పేర్కొన్నారు.సాయంత్రం 4 గంటలకు కేసీఆర్ కు తుంటి ఎముక మార్పిడి సర్జరీ నిర్వహించనున్నట్లు తెలిపారు.
సర్జరీ తరువాత ఆయనకు రెస్ట్ అవసరమన్న డాక్టర్స్ ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు.అయితే నిన్న రాత్రి ఎర్రవెల్లి ఫామ్ హౌజ్ లో కేసీఆర్ కాలు జారి పడటంతో ఆయన ఎడమ తుంటికి గాయమైన సంగతి తెలిసిందే.







