ఖర్బూజాపండులో ఉన్న అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

ఖర్బూజాపండు అనే హైబ్రిడ్ పుచ్చకాయను మొదట ఇజ్రాయెల్ లో ఉత్పత్తి చేసారు.ఈ పుచ్చకాయ లోపల మరియు బయట హానీడ్యూ పుచ్చకాయను ప్రతిబింబిస్తుంది.

తీపి రుచిలో ఉండే ఈ ఖర్బూజాపండును ఎక్కువగా డిజర్ట్ తయారీలో ఉపయోగిస్తారు.విజన్ కర్బూజాలో విటమిన్ ఎ మరియు కెరోటినాయిడ్స్ సమృద్దిగా ఉండుట వలన దృష్టి సమస్యలను నివారించడానికి మరియు కళ్ళను రక్షించటానికి సహాయపడుతుంది.

బీటా-కెరోటిన్ UV వికిరణాల వలన వచ్చే శుక్లాలు, మచ్చల క్షీణతను తగ్గించటంలో అద్భుతంగా పనిచేస్తుంది.గుండె ఆరోగ్యం కర్బూజాలో ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన చెడు కొలస్ట్రాల్ ని తగ్గించి అథెరోస్క్లెరోసిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

అలాగే దీనిలో ఉండే పొటాషియం రక్త నాళాలను వెడల్పు చేసి గుండె జబ్బులు, రక్తనాళాలకు సంబంధించిన గుండె వ్యాధులు రాకుండా నివారిస్తుంది.అంతేకాక రక్తపోటు స్థిరంగా ఉండేలా చేస్తుంది.

Advertisement

డయాబెటిస్ నివారణ కర్బూజాలో ఉండే పెక్టిన్ మరియు పీచు పదార్దం సాధారణ చక్కెరలు మరియు పిండి పదార్ధాలు గ్లూకోజ్ గా మారి రక్త ప్రవాహంలో కలవకుండా నియంత్రణ చేస్తాయి.అందువలన పెక్టిన్ మధుమేహ నియంత్రణలో సహాయపడుతుంది.

డయాబెటిక్ రోగులు సురక్షితంగా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించటానికి కర్బూజాను తినవచ్చు.జీర్ణ సంబంధ ఆరోగ్యం కర్బూజాలో పెక్టిన్ మరియు పీచు పదార్దం సమృద్దిగా ఉండుట వలన జీర్ణశయాంతర సమస్యలను తొలగించటానికి సహాయపడుతుంది.

అంతేకాక కడుపు నిండిన అనుభూతి మరియు ఎక్కువ తినటాన్ని నిరోదిస్తుంది.అందువల్ల ప్రతి రోజు ఆహారంలో కర్బూజా ఉండేలా చూసుకోవటం మంచిది.

బాల్య వివాహం నుంచి తప్పించుకుంది.. ఇంటర్ లో 978 మార్కులు.. కుసుమ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

Advertisement

తాజా వార్తలు