గుడ్డులోని పచ్చసొన తింటే బ‌రువు పెరుగుతారా.. ఖ‌చ్చితంగా తెలుసుకోండి!

గుడ్డు.ఆరోగ్య ప‌రంగా, సౌంద‌ర్య ప‌రంగా ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను చేకూరుస్తుంది.

సంపూర్ణ పోష‌కాహారం అయిన గుడ్డును రోజుకు ఒక‌టైనా తీసుకోవాల‌ని ఆరోగ్య నిపుణులు ఎప్ప‌టిక‌ప్పుడు చెబుతుంటారు.

అయితే చాలా మంది చేసే పొర‌పాటు.

గుడ్డు తినే స‌మ‌యంలో లోప‌ల ప‌చ్చ‌సొన‌ను పాడేయ‌డం.గుడ్డు ప‌చ్చ‌సొన‌లో కొలెస్ట్రాల్ ఎక్కువ‌గా ఉంటుంది.

అందువ‌ల్ల‌, గుడ్డు ప‌చ్చ సొన తింటే బ‌రువు పెరుగుతార‌ని, గుండె సంబంధిత స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని చాలా మంది న‌మ్ముతారు.అందుకే గుడ్డు లోప‌లి భాగాన్ని ఎవైడ్ చేస్తుంటారు.

Advertisement
Health Benefits Of Egg Yolk! Health, Benefits Of Egg Yolk, Egg Yolk, Eating Egg

కానీ, వాస్త‌వానికి గుడ్డులోని ప‌చ్చ‌సొన తిన‌డం వ‌ల్ల బ‌రువు ఏ మాత్రం పెర‌గ‌రు.గుడ్డు ప‌చ్చ‌సొన‌లో కొలెస్ట్రాల్ ఉన్న‌ప్ప‌టికీ.

కేల‌రీలు త‌క్కువ‌గా ఉంటాయి.కాబట్టి, తిన్నా బరువు పెరుగుతారన్న భ‌యం పెట్టుకోన‌వ‌స‌రం లేదు.

అలాగే గుడ్డు ప‌చ్చ సొన తింటే ర‌క్తంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంద‌ని.ఫ‌లితంగా గుండె జబ్బులు వ‌స్తాయ‌ని అంద‌రూ అనుకుంటారు.

కానీ, రోజుకు ఒక గుడ్డును పూర్తిగా అంటే ప‌చ్చ సొన‌తో పాటు తీసుకుంటే ర‌క్తంలో ఎలాంటి కొలెస్ట్రాల్ పెర‌గ‌ద‌ని ఎన్నో అధ్య‌య‌నాలు నిరూపించాయి.

Health Benefits Of Egg Yolk Health, Benefits Of Egg Yolk, Egg Yolk, Eating Egg
న్యూస్ రౌండప్ టాప్ 20

ఇక గుడ్డ ప‌చ్చ సొన తిన‌డం వ‌ల్ల ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు పొందొచ్చు.ముఖ్యంగా ఆడ‌వారికి మ‌రియు చిన్న పిల్ల‌ల‌కు గుడ్డులోని ప‌చ్చ‌సొన ఎంతో మేలు చేస్తుంది. సూర్యర‌శ్మి నుంచి ల‌భించే విట‌మిన్ డి, శ‌రీరంలో అద‌నంగా పేరుకుపోయి ఉన్న కొవ్వును క‌రిగించే కోలీన్ మ‌రియు సెలీనియం గుడ్డు ప‌చ్చ‌సొనలో పుష్క‌లంగా ఉంటాయి.

Advertisement

అంద‌వ‌ల్ల‌, మీరు గుడ్డ ప‌చ్చ‌సొన‌ను ఎవైడ్ చేస్తే.ఈ పోష‌కాల‌ను మిస్ చేసుకున్న వారు అవుతారు.అంతేకాదు, గుడ్డులోని ప‌చ్చ‌సొన‌ను దూరం పెడితే.

విట‌మిన్ బి, విట‌మిన్ ఎ, విట‌మిన్ ఇ, విట‌మిన్ కె, అమైనా యాసిడ్స్‌, జింక్ ఇలా ఎన్నో పోష‌కాల‌ను కోల్పోవాల్సి వ‌స్తుంది.కాబ‌ట్టి, గుడ్డులోని పచ్చసొన తింటే బ‌రువు పెరుగుతారు అన్న అపోహ‌ను ప‌క్క‌న పెట్టి.

నిశ్చింతగా పూర్తి ఎగ్‌ను డైట్‌లో చేర్చుకోండి.

తాజా వార్తలు