టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు( Ganta Srinivasa Rao ) కీలక వ్యాఖ్యలు చేశారు.చీపురుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని పార్టీ అధిష్టానం తనకు చెప్పిందన్న ఆయన తాను కూడా అదే ఆలోచన చేస్తున్నట్లు పేర్కొన్నారు.

తనకు చీపురుపల్లి(Cheepurupalli Assembly constituency ) సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఉందన్నారు.అంతేకాకుండా ఆ నియోజకవర్గం ఉన్న జిల్లా కూడా వేరని తెలిపారు.అలాగే మరో వారం రోజుల్లో టీడీపీ( TDP ) అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉందని స్పష్టం చేశారు.అయితే తనకు విశాఖ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఉందని స్పష్టం చేశారు.







