వైరల్: ఒళ్ళిరుపంటే ఇదే... స్టంట్ చేయాలనుకుని బొక్కబోర్లా పడ్డాడు!

సోషల్ మీడియా బాగా ప్రబలడంతో దేశంలో ఎక్కడో జరిగినటువంటి విషయాలు కూడా వీడియోలు రూపంలో మన ముందుకు వచ్చేస్తున్నాయి.ఇక నేటి తరం కుర్రాళ్ళయితే ఏ విధంగా వున్నారో మీకు తెలియంది కాదు.

 He Wanted To Do A Stunt And Went Crazy , Stunt, Viral Latest, News Viral, Social-TeluguStop.com

ఒక్కోసారి వారు రోడ్లమీద చేసే విన్యాసాలు చూస్తే, వారి భవిష్యత్ ఎలా ఉంటుందో అని భయం కలగక మానదు.అలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

కాగా దానిని చూసిన నెటిజన్లు అయితే మనోడికి బాగా ఏసుకుంటున్నారు.

వీడియోని ఒకసారి గమనిస్తే, ఒక వ్యక్తి పలు ఫ్లోర్లు ఉన్న బిల్డింగ్ మెట్లపై నుంచి దిగే ప్రయత్నం చేస్తున్నాడు.అయితే, మెట్ల మీద నుంచి కింది ఫ్లోర్‌కు దిగకుండా మెట్ల పక్కనుండే రెయిలింగ్‌పై కూర్చుని స్లైడ్ డౌన్ చేద్దామని మెలికలు తిరిగాడు.అంటే రెయిలింగ్‌పై నుంచి కిందికి వయ్యారంగా జారే ప్రయత్నం చేసాడు.

అయితే ట్విస్ట్ ఏమంటే, ఈ క్రమంలో దానిపై నుంచి అదుపుతప్పి కింద పడిపోయాడు.కింద ఉన్న ఒక ఫ్లోర్ దాటి, మరో ఫ్లోర్ మెట్లపై పడిపోవడం వీడియోలో స్పష్టంగా కనబడుతోంది.

ఇక బాగా ఎత్తు నుంచి పడటంతో అతడికి తీవ్ర గాయాలయినట్టు అర్ధం అవుతోంది.అయితే అదృష్టవశాత్తు ఫ్లోర్‌పై పడడంతో పెద్ద ప్రమాదమే తప్పింది.అదే మధ్యలో నుంచి నేరుగా కింది ఫ్లోర్‌కు పడిపోయుంటే ప్రాణాలు గాల్లో కలిసిపోయేవే.అంత ఎత్తునుండి రెయిలింగ్‌పై నుంచి కిందికి జరాలని అనుకున్నపుడు అదుపుతప్పితే ఏమవుతుందో ఊహించాల్సి ఉండాల్సింది.

అలా ఏమాత్రం ఆలోచన లేకుండా చేసిన అతని పనికి నెటిజన్లు ఒక రేంజ్ లో వాడేసుకుంటున్నారు.ఈ తరానికి బాధ్యత లేకపోవడం అనేదానికి ఉదాహరణ ఈ వీడియో చాలామంది కామెంట్ చేయడం ఇక్కడ గమనించవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube