మంచాన్నే వాహనంగా మార్చేశాడు.. ఇతని తెలివికి హాట్సాఫ్..!

సోషల్ మీడియా( Social media )లో వస్తున్న కొన్ని వీడియోలను చూస్తే ఫన్నీగా అనిపిస్తుంది.మరికొన్ని వీడియోలను చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది.

 He Turned The Bed Into A Vehicle.. Hats Off To His Intelligence..! ,  Bed ,-TeluguStop.com

రోజు ఎన్నో రకాల వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమై వైరల్ అవుతున్నాయి.చాలామంది తమ టాలెంట్ ను సోషల్ మీడియాలో వీడియోల రూపంలో ప్రదర్శిస్తూ ఆకర్షిస్తున్నారు.

ఇంతవరకు చాలా రకాల వెరైటీ వీడియోలను చూసి ఉంటాం కానీ మంచాన్ని వాహనంగా మార్చేశాడు ఓ వ్యక్తి.ప్రస్తుతం ఆ వెరైటీ వాహనం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

నిద్ర పోవాలంటే మంచం పై పడుకోవచ్చు, అదే ప్రయాణం చేయాలంటే ఆ మంచానికి పెట్రోల్ అందిస్తే చాలు రోడ్లపై పరుగులు పెడుతుంది.ఒక మంచానికి మూడు చక్రాలు అమర్చి వాహనంగా మార్చేశాడు.

ఇక ఆ వాహనాన్ని డ్రైవ్ చేసుకుంటూ పెట్రోల్ బంకు వచ్చాడు.పెట్రోల్ బంక్ ( Petrol Bunk )పక్కన ఉండే స్థానికులు ఈ వాహనాన్ని చూసి ఆశ్చర్యపోయారు.

కొందరు ఈ వాహనాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఇక ఈ వాహనం తయారీలో ఒక మంచం, మూడు సైకిల్ చక్రాలు( Three bicycle wheels ), ఒక కార్ స్టీరింగ్ ఉపయోగించారు.ఇక ఈ వాహనానికి ఒకవైపు హ్యాండిల్, రేస్ మొదలైనవి కూడా అమర్చారు.మంచం కింద ఒక మోటారు బిగించారు.

చాలా సింపుల్ గా ఈ వాహనాన్ని తయారు చేశారు.ప్రస్తుతం ఈ వాహనానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.

టాలెంట్ అనేది ప్రతి మనిషిలో ఉంటుంది.సరిగ్గా ఉపయోగించుకుంటే ఎన్నో అద్భుతాలు చేయొచ్చు.సోషల్ మీడియాలో మట్టి కుండలో ఏసీ కూలర్, టేబుల్ ఫ్యాన్ తో ఏసీ లాంటి చల్లదనం, సైకిల్ ను బైక్ గా మార్చిన వీడియోలు చాలా చూశాం.చాలామంది తమ టాలెంట్ ను బయటకు తీసి సోషల్ మీడియా వేదికగా అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు.

ఇంకా ముందు ముందు ఇలాంటి వెరైటీ వీడియోలు ఎన్ని సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవుతాయో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube