టాలీవుడ్ ఇండస్ట్రీలో మిడిల్ రేంజ్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న నితిన్ ( Nithiin) ప్రస్తుతం మన ముందుకు ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే మూవీతో రాబోతున్నారు.ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా చేస్తోంది.
అయితే ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్ ( Rajashekhar ) కూడా కీలకపాత్ర పోషిస్తున్న సంగతి మనకు తెలిసిందే.తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో నితిన్ చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నితిన్ మాట్లాడుతూ.నేను ఆ హీరో వల్లే ఇండస్ట్రీకి వచ్చాను అంటూ మాట్లాడడం అందరినీ ఆకర్షించింది.
మరి ఇంతకీ నితిన్ హీరో కావడానికి అసలు కారణం ఏ హీరోనో ఇప్పుడు తెలుసుకుందాం.

నితిన్ శ్రీలీల కాంబినేషన్లో వస్తున్న ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ ( Extra Ordinary Man ) సినిమాకి వక్కంతం వంశీ దర్శకత్వం వహించారు.ఈ సినిమా డిసెంబర్ 8న విడుదలకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాదులో గ్రాండ్ గా నిర్వహించారు మూవీ యూనిట్.ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్టేజ్ పై నితిన్ మాట్లాడుతూ.
ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీ చాలా బాగుంటుంది ఈ సినిమా అందరూ థియేటర్లలో చూడండి.ఇక ఈ సినిమాలో కీలకపాత్ర పోషించిన రాజశేఖర్ గారి వల్లే నేను ఇండస్ట్రీకి వచ్చాను.

ఎలా అంటే.ఈయన నటించిన మగాడు సినిమా ( Magaadu movie ) కి డిస్ట్రిబ్యూటర్ గా మా నాన్న పనిచేశారు.అయితే ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడం వల్ల మా నాన్న సినిమా ఇండస్ట్రీలో కొనసాగాలి అని నిర్ణయించుకున్నారు.ఒకవేళ ఈ సినిమా గనుక ప్లాఫ్ అయి ఉంటే మా నాన్న ఇండస్ట్రీలో సెటిల్ అయ్యేవారు కాదు.
అలాగే నాకు సినిమాలపై ఇంట్రెస్ట్ పెరిగేది కాదు.మా నాన్న ఇండస్ట్రీలో మగాడు సినిమా ద్వారా సెటిల్ అవ్వడంతో నాకు కూడా సినిమాల్లో హీరో అవ్వాలి అనే ఇంట్రెస్ట్ పెరిగింది.
అలా రాజశేఖర్ గారి వాళ్ళ అటు మా నాన్న ఇటు నేను ఇండస్ట్రీలో కొనసాగుతున్నాం అంటూ నితిన్ ( Nithiin ) చెప్పుకొచ్చారు.అలా నితిన్ ఇండస్ట్రీకి రావడానికి సీనియర్ హీరో రాజశేఖర్ కారణమయ్యారని తెలుస్తోంది.
ఇక ఈ విషయాన్ని స్వయంగా నితిన్ చెప్పుకొచ్చారు.ఇక ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీ ప్రేక్షకులను అన్ని రకాలుగా ఆకట్టుకుంటుందని ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్,సాంగ్స్ చూస్తే అర్థమవుతుంది.