కేటీఆర్ తొందరపడ్డారా ? ట్రోలింగ్ మామూలుగా లేదు !

తెలంగాణ మంత్రి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చాలా కూల్ గా ఉంటారు.ఏ విషయంలోనూ తొందర పడరు.

తనకు అప్పగించిన బాధ్యతలు వరకు చూసుకుంటారు.సైలెంట్ గానే ఉంటూ పార్టీలో పట్టు సాధిస్తూ వస్తున్నారు.

అనవసర విమర్శలు జోలికి వెళ్లకూడదు అనే ఉద్దేశంతోనే హుజురాబాద్ ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు కేటీఆర్ దూరంగానే ఉంటూ వస్తున్నారు.అయితే కేటీఆర్ విషయంలో కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎప్పుడూ విమర్శలు చేస్తూనే ఉంటారు.

అయినా కేటీఆర్ మాత్రం పెద్దగా స్పందించరు.  కానీ టాలీవుడ్ లో కలకలం రేపుతున్న డ్రగ్స్ వ్యవహారం లో కేటీఆర్ పాత్ర ఉందనే విషయాన్ని రేవంత్ రెడ్డి  పదేపదే ప్రస్తావిస్తూ విమర్శలు చేస్తున్నారు.

Advertisement

దీనిపైన కేటీఆర్ ఘాటుగానే స్పందించారు.రేవంత్ ఆరోపణల పై మీడియా సమావేశం నిర్వహించి మరీ హెచ్చరికలు జారీ చేశారు.

తమపై అనవసరంగా విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని,  రాజద్రోహం కేసులు పెడతామంటూ కేటీఆర్ హెచ్చరించారు.  అసలు ఇంత కంటే ఎన్నో అంశాలపై రేవంత్ వంటి వారు విమర్శలు చేసినా, కేటీఆర్ పట్టించుకునే వారు కాదు.

కానీ ఈ డ్రగ్స్ విషయంలో మాత్రం కేటీఆర్ తొందరపడి విమర్శలు చేశారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.డ్రగ్స్ విషయంలో తాను ఏ టెస్ట్ చేయించుకునేందుకు అయినా  సిద్ధమని కేటీఆర్ సవాల్ విసిరారు.

కాకపోతే తనతో పాటు రాహుల్ గాంధీ కూడా ఈ టెస్ట్ లు చేయించుకోవాలి అంటూ మాట్లాడిన తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది.

అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి ముందే తెలుసా..?
తెలంగాణ లోక్ సభ ఎన్నికల బరి నుంచి తప్పుకున్న సీపీఎం..!!

ఇక శశిథరూర్ ను రేవంత్ రెడ్డి గాడిద అని తిట్టడం పైనా కేటీఆర్ రీయాక్ట్ అయ్యారు.తనకు కాంగ్రెస్ అంటే చాలా అభిమానం అని, కానీ రేవంత్ వంటి నాయకుడు ఆ పార్టీ లో ఉండకూడదు అని వ్యాఖ్యానించడం పై టిఆర్ఎస్ లో కేటీఆర్ వ్యాఖ్యలపై చర్చ జరుగుతోంది.  రేవంత్ చేసిన విమర్శలకు సమాధానం చెప్పబోయి కేటీఆర్ తొందరపాటు వ్యాఖ్యలు చేశారని, దీని కారణంగా ఆయనపై అనవసర అనుమానాలు కలుగుతున్నాయి అనేది టీఆర్ఎస్ నాయకుల అభిప్రాయం.

Advertisement

సోషల్ మీడియా లో అయితే కేటీఆర్ స్పందన పై ఆయనను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. .

తాజా వార్తలు