అరుదైన ఈ వీణను చూశారా? దీని బరువు ఏకంగా 14 టన్నులు ఉంటుంది!

లతామంగేష్కర్ గురించి పరిచయం అక్కర్లేదు.దాదాపు దాదాపు 20 భాషలలో 50 వేలకు పైగా పాటలు పాడిన లతామంగేష్కర్ అంటే తెలియని ప్రపంచం ఉండదనే చెప్పుకోవాలి.

 Have You Seen This Rare Veena It Weighs A Total Of 14 Tons , Viral Latest, News-TeluguStop.com

అందుకే ఆమెని గానకోకిల బిరుదుతో పిలిచేవారు.ఈ క్రమంలో లతా మంగేష్కర్ కు భారత ప్రభుత్వం భారతరత్న పురస్కారం ఇచ్చి సత్కరించింది.

హిందీ సినీపాటల గాయనిగా ప్రస్థానం మొదలుపెట్టినప్పటికీ యావత్ ఇండియన్ భాషలన్నింటిలోనూ పాటలు పాడిన ఘనత ఆమెది.హిందీ పాటలపై, హిందీ సినిమా జగత్తుపై ఆమె వేసిన ముద్ర అటువంటిది.

అయితే ఆమె ఇటీవల కాలం చేసిన సంగతి తెలిసినదే.ఈ సందర్భంగా UP సర్కార్ ఘనంగా నివాళి అర్పించింది ఆమెకు.అవును, లతామంగేష్కర్ కు గుర్తుగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అయోధ్య‌లో 40 ఫీట్ల వీణ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేశారు.లతామంగేష్కర్ చౌక్ దగ్గర 14 టన్నుల బరువున్న 40 ఫీట్ల వీణ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేశారు.

ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ వర్చువల్ గా ఈ విగ్రహాన్ని ప్రారంభించనున్నారు.ఈ కార్యక్రమంలో UP సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొననున్నారు.

Telugu Tuns, Latest, Veena-Latest News - Telugu

ఈ సందర్భంగా నగరంలోని రామ్ కథా పార్క్ లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.దేశంలోనే ఇంత పెద్ద సంగీత వాయిద్యాన్ని ఏర్పాటు చేయడం ఇదే ప్రథమమని అక్కడి అధికారులు చెబుతున్నారు.1929లో లతా మంగేష్క‌ర్ జననం జరిగింది.ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి ఆర‌వ తేదీన ఆమె ముంబైలో మ‌ర‌ణించారు.

ఉత్త‌మ నేప‌థ్య గాయ‌నిగా ఆమె మూడు సార్లు జాతీయ అవార్డు కూడా వచ్చింది.ఈ వీణను దీనిని పద్మశ్రీ అవార్డు గ్రహీత రామ్ సుతార్ తయారు చేశారు, దీని తయారీకి రెండు నెలల సమయం పట్టింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube