ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్లను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్ ప్రవేశపెడుతూ ఉంటుంది.ఈ క్రమంలో సెక్యూరీటీ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్న వాట్సాప్ త్వరలో లాగిన్ అప్రూవల్ పేరుతో మరో సరికొత్త ఫీచర్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
ఉదాహరణకు సాధారణంగా యూజర్లు అవసరాన్ని బట్టి ఉపయోగించే కంప్యూటర్‌లో జీమెయిల్ అకౌంట్‌ను ఓపెన్ చేస్తుంటారు.అలా కాకుండా కొత్త కంప్యూటర్లలో జీమెయిల్ ఓపెన్ చేసేందుకు యత్నించినపుడు జీమెయిల్ ఓపెన్ చేసేది మీరేనా? కాదా? అంటూ మన ఫోన్‌లకు అలెర్ట్ మెసేజ్ వస్తుంది.
ఇదే మాదిరిగా ఇన్‌స్ట్రాగ్రామ్‌లో సైతం లాగిన్ అప్రూవల్ అడుగుతుందనే విషయం తెలిసినదే.ఇదే తరహా ఫీచర్ త్వరలో వాట్సాప్ సైతం ఎనేబుల్ చేయనుంది.యూజర్లు పొరపాటున కొత్త డివైజ్ నుంచి వాట్సాప్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నిస్తే.వెంటనే మనకు సదరు వాట్సాప్ అకౌంట్ ఓపెన్ చేసేది ఎవరని ప్రశ్నిస్తూ ఓ మెసేజ్ అలెర్ట్ వస్తుంది.
ఆ మేసేజ్‌కు మీరు రిప్లయి ఇస్తేనే వాట్సాప్ ఓపెన్ అవుతుంది.లేదంటే లేదు.
వాట్సాప్ బ్లాగ్ వీ బీటా ఇన్ఫో ప్రకారం.ఎవరైనా మీ వాట్సాప్ అకౌంట్‌లో లాగిన్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, మీరు అందుకు అంగీకారం తెలపాల్సి ఉంటుంది.
అంతేకాదు 6 అంకెల ఓటీపీని షేర్ చేస్తే.ఆ నెంబర్‌ను ఒకవేళ తప్పుగా ఎంటర్ చేస్తే చివరకు లాగిన్ అయ్యే అవకాశాన్ని కోల్పోవచ్చు.
అదనంగా, మీ వాట్సాప్ అకౌంట్‌ను మీకు తెలియకుండా ఎవరైనా లాగిన్ అయేందుకు ప్రయత్నిస్తే.ఆఫోన్ వివరాలు, టైంతో పాటు ఇతర సమాచారం మనకు చేరవేస్తుంది వాట్సాప్.
ఈ కొత్త ఫీచర్ యూజర్లకు అనేకరకాలుగా ఉపయోగపడనుంది.ముఖ్యంగా సెక్యూరిటీ దృష్ట్యా ఇదొక అద్భుత ఫీచర్ అని చెప్పుకోవాలి.