ఈ పిల్లి వేషాలు చూశారా.. ఫ్యాషన్ మోడల్స్ కూడా పనికిరారు..

సాధారణంగా ఆడవారు ర్యాంప్ వాక్ చేసేటప్పుడు క్యాట్ వాక్ చేస్తారు.క్యాట్ చాలా వయ్యారంగా నడుస్తుంది.

 Have You Seen This Cat's Disguises Even Fashion Models Viral , Viral Video, Vir-TeluguStop.com

అందుకే క్యాట్ వాక్ నేర్చుకుని మరీ ఆడవారు హొయలు పోతుంటారు.అయితే తాజాగా వారికి పోటీగా ఒక పిల్లి ఫ్యాషన్ షో( Fashion show ) చేసింది.

అది ఫ్యాషన్ డ్రెస్సులు ధరించి క్యాట్ వాక్ చేసుకుంటూ నెటిజన్లను ఫిదా చేస్తోంది.@ShouldHaveCat అనే ట్విట్టర్ పేజీ ఈ వీడియోను షేర్ చేసింది.దీనికి ఇప్పటికే 15 లక్షలు పైగా వ్యూస్ వచ్చాయి.25 వేలకు పైగా లైక్స్ వచ్చాయి.“బెస్ట్ ఫ్యాషన్ షో” అని ఈ వీడియోకి ఒక క్యాప్షన్ జోడించారు.

వైరల్ అవుతున్న వీడియో క్లిప్‌లో ఒక నల్ల పిల్లిని మనం చూడవచ్చు.మొదటిగా ఈ పెళ్లి మెడలో ఏదో పూలదండ లాంటిది ధరించి అందంగా నడుస్తూ వచ్చింది దాని ముందే కెమెరా ఉంది.ఆ కెమెరాలో ఈ దృశ్యాలన్నీ రికార్డు అయ్యాయి.

ఆ కెమెరా ముందు ఇది ఐ గ్లాస్సెస్ ధరించి మెడలో చైన్ వేసుకుని నడుస్తూ చాలా స్టైలిష్ గా కనిపించింది.తర్వాత మెడ చుట్టూ పూలు వేసుకొని నడుస్తూ కనిపించి ఫిదా చేసింది.

అనంతరం రెక్కలు ధరించి ప్రత్యక్షమైంది.

ఈ వీడియో చూసి చాలా మంది ముచ్చట పడుతున్నారు.ఈ పిల్లి ఆ డ్రస్సులు భలే ఇష్టంగా ధరించి మోడల్ వలె నడిచింది కదా అని మరికొందరు ఆశ్చర్యపోతున్నారు.ఈ పిల్లిని పారిస్ ఫ్యాషన్ షో కి పంపించాలి.

కచ్చితంగా గెలిచి వస్తుంది అని మరికొందరు ఫన్నీగా పేర్కొన్నారు.ఇదే వీడియో కింద మరికొన్ని క్యాట్ ఫ్యాషన్ వీడియోలు కూడా పోస్ట్ చేశారు.

అవి కూడా మీరు చూడవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube