కొందరు వ్యక్తులు కొత్త, విచిత్రమైన ఆహారాన్ని ప్రయత్నించడానికి ఇష్టపడతారు.అలాంటి వారి కోసం వీధి వ్యాపారులు, హోటల్, రెస్టారెంట్స్ రకరకాల ఫుడ్స్ తయారు చేస్తున్నాయి.
ముఖ్యంగా ఫుడ్ కాంబినేషన్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి.సోషల్ మీడియాలో కూడా ఈ వెరైటీ కాంబోలకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారుతున్నాయి.
ఇటీవల కాలంలో బియ్యంతో నూడుల్స్, బ్రెడ్ ఐస్‌క్రీమ్, చాక్లెట్ పిజ్జా వంటి అనేక చిత్ర విచిత్రమైన ఆహారాలు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొట్టాయి.
తాజాగా ఇంటర్నెట్‌లో మరో ఫుడ్ కాంబో పాపులర్ గా మారింది.దానిని ఇడ్లీ ఐస్‌క్రీమ్ అంటారట.ఓ వీధి వ్యాపారి ఈ వెరైటీ రెసిపీ తయారు చేస్తుంటే వీడియో తీసి కొందరు సోషల్ మీడియాలో షేర్ చేశారు.
మెత్తటి మల్లె పువ్వు లాంటి ఇడ్లీ ని సాధారణంగా సాంబార్‌తో తింటారు, లేదా చట్నీలు, కొబ్బరి, పుదీనా లేదా టమోటాలతో చేసిన సాస్‌లు నంచుకుంటారు.కానీ ఎవరు ఐస్ క్రీమ్( Ice cream ) తో తినరు అసలు ఆ టేస్ట్ బాగుండదు.
వైరల్ వీడియోలో ఉన్న వీధి వ్యాపారి ఇడ్లీ( Idli )ని చిన్న ముక్కలుగా కోసి చల్లని మెటల్ ప్లేట్‌లో ఎలా ఉంచాడో మనం చూడవచ్చు.తరువాత ఇడ్లీ ముక్కల పైన రెడ్ చట్నీ, కొబ్బరి చట్నీ, సాంబార్, ఐస్ క్రీమ్ కలుపుతాడు.అన్నింటినీ కలిపి ప్లేట్‌లో చదును చేస్తాడు.దానిని ఒక సన్నని పొరగా చేసి, దానిని స్క్రోల్ లాగా చుట్టాడు.ఆపై దానిని ప్లేట్‌లో సగం ఇడ్లీ, మరికొన్ని చట్నీలను టాపింగ్స్‌గా అందిస్తాడు.ఈ వీడియోను ఫుడ్ బ్లాగర్ సుక్రిత్ జైన్ ( Sukrit Jain )ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.
ఇడ్లీ ఐస్‌క్రీమ్ రుచి తనకు బాగా నచ్చిందని చెప్పాడు.ఈ వీడియోను 12.7 మిలియన్ కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి.ఈ వీడియోపై చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.
కొందరికి అసహ్యం, కోపం వ్యక్తం చేయగా, ఇడ్లీని నాశనం చేసిన వ్యాపారిని శిక్షించాలని మరికొందరు ఫన్నీగా పేర్కొన్నారు.