నీలిరంగు కోడిగుడ్లు( Blue egg ).అయ్ బాబోయ్, మేమెప్పుడూ చూడలేదు అనే అనుమానం కలుగుతోంది కదా.
ఎందుకంటే కోడి గుడ్లు అయినా, బాతు గుడ్లు అయినా లేదంటే ఇంకే పిట్ట గుడ్లు అయినా ఎక్కువగా తెలుపు రంగులోనే ఉంటాయి.అయితే కొన్ని పక్షులు గోధుమ రంగు కోడి గుడ్లను కూడా పెడుతూ ఉంటాయి.
అయితే అందరికీ ఎక్కువగా కనిపించేవి మాత్రం తెలుగు రంగు గుడ్లే.అయితే కడక్నాథ్ కోళ్లు( Kadaknath Chicken ) పెట్టే గుడ్లు మాత్రం నలుపు రంగులో ఉంటాయి.
ఇవి చాలా ఖరీదైనవి కాబట్టి మనకి ఎక్కువగా కనిపించవు.
అయితే వేరే ఇతర రంగుల్లో కూడా మనకి చాలా అరుదుగా గుడ్లు కనబడతాయి.బహుశా మీరు వాటిని చూసుండరు.అవును, కోడి గుడ్లను ఎప్పుడైన నీలి రంగులో ఉండటం చూశారా? ఓ దేశంలోని కోళ్లు నీలి రంగులో మాత్రమే గుడ్లను పెడతాయి.అయితే ఆ గుడ్లు నీలి రంగులో ఉండటానికి ఓ ప్రత్యేక కారణం ఉందండోయ్.‘అరౌకానా( Araucana )’ అనే జాతి కోళ్లు నీలి రంగు గుడ్లను పెడతాయి.ఈ రకం కోళ్లు ఎక్కువగా చిలి దేశంలో కనిపిస్తాయి.ఇలా గుడ్లు నీలి రంగులో ఉండటానికి కారణం మాత్రం వైరస్.
వైరస్ ల వలెనే అవి అలా నీలిరంగులో గుడ్లను పెడుతూ ఉంటాయి.ఈ జాతి కోడిని మొదటిసారిగా 1914 సంవత్సరంలో స్పానిష్ పక్షి శాస్త్రవేత్త సాల్వడార్ కాస్టెల్ గుర్తించారు.చిలీ దేశంలోని అరౌకానియా ప్రాంతంలో ఈ కోడి మొదట కనిపించడం జరిగింది.
అందుకే ఈ జాతి రకం కోడికి అరౌకానా అనే పేరు పెట్టారు.ఇది దేశీ రకం కోడి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.‘రెట్రో వైరస్‘ వల్లే గుడ్లు నీలి రంగులోకి మారుతున్నట్లు శాస్త్రవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇవి ఒకే ఆర్ఎన్ఏ వైరస్ లు.జన్యువుల నిర్మాణంలో మార్పు కారణంగా, కోడి గుడ్ల రంగు మారుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.