మనం ఏదైనా అపార్ట్‌మెంట్లలో, షాపింగ్ మాల్స్‌లలో వెళ్లినప్పుడు అక్కడ లిఫ్టులు చూసి ఉంటాం.బటన్ నొక్కిన తర్వాత కింద నుంచి కానీ, పై నుంచి కానీ మనం ఉన్న ఫ్లోర్‌కి లిఫ్ట్ వచ్చి ఆగుతుంది.
లోపలికి వెళ్లి ఏ ఫ్లోర్‌కి వెళ్లాలో ఆ నంబరుపై మనం క్లిక్ చేస్తే లిఫ్ట్ ఆ ఫ్లోర్‌కి వెళ్లి ఆగుతుంది.ఇంత వరకు మనకు తెలుసు.
అయితే ఓ లిఫ్ట్ మాత్రం అందుకు విరుద్ధంగా ఉంటుంది.దానికి డోర్లు ఏ మాత్రం ఉండవు.
పైగా అది నిరంతరం రన్నింగ్ లోనే ఉంటుంది.అందులోకి ఎక్కి చాలా జాగ్రత్తగా మనకు కావాల్సిన ఫ్లోర్ లో దిగాలి.
పైగా అది ఒక సెకను కూడా ఆగదు.ఓ వైపు లిఫ్ట్ పైకి వెళ్తుంటే మరో వైపు లిఫ్ట్ కిందకు దిగుతుంటుంది.
ఇలాంటి లిఫ్ట్ గురించి తెలుసుకుందాం.
పేటర్‌నోస్టర్ ఎలివేటర్ అనేది ఒక రకమైన ప్రయాణీకుల లిఫ్ట్.
ఇది భవనం లోపల పైకి క్రిందికి లూప్‌లో నెమ్మదిగా కదులుతున్న ఓపెన్ కంపార్ట్‌మెంట్ల గొలుసు లేదా కన్వేయర్ బెల్ట్‌ను కలిగి ఉంటుంది.ప్రతి భాగం లూప్ యొక్క ఎగువ (లేదా దిగువన) చేరుకుంటుంది.
ఇది అవరోహణకు ముందు (లేదా ఆరోహణ) పక్కకు మారుతుంది.ఇది ఆపకుండా ఇవన్నీ చేస్తుంది.
ప్రయాణీకులు తమకు నచ్చిన ఏదైనా అంతస్తులో అడుగు పెట్టడం మరియు దిగడం చేయొచ్చు.పీటర్ ఎల్లిస్ 1868లో లివర్‌పూల్‌లోని ఓరియల్ ఛాంబర్స్‌లో మొదటి పేటర్‌నోస్టర్ లిఫ్ట్‌లను ఇన్‌స్టాల్ చేశాడు.
లిఫ్ట్ యొక్క లూప్ రోసరీని గుర్తుకు తెస్తుంది కాబట్టి పేటర్‌నోస్టర్ అనే పేరు పెట్టబడింది.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మిగిలిన లిఫ్టుల కంటే ఇది విభిన్నంగా ఉంటుంది.దీనిని చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు.
అయితే ఇందులో కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి.దీనిని కేవలం మామూలు యుక్త వయసులో ఉన్న వారు మాత్రమే ఉపయోగించుకోగలరు.
వృద్ధులు, చిన్న పిల్లలు, వికలాంగులు దీనిని ఉపయోగించుకోలేరు.







