మాస్ మహారాజా రవితేజ ఎట్టకేలకు సాలిడ్ కమర్షియల్ సక్సెస్ ని దక్కించుకున్నాడు.చాలా సంవత్సరాల తర్వాత రవితేజ నుండి ఒక భారీ సక్సెస్ రావడం తో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
రవితేజ ధమాకా సినిమా తో ఏకంగా 100 కోట్ల రూపాయల కలెక్షన్స్ నమోదు చేయడం ఆయన అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తుంది.తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా భారీ వసూళ్ల దిశ గా ఇంకా దూసుకు పోతూనే ఉంది.
సంక్రాంతి సినిమా లకు మరో వారం రోజుల సమయం ఉంది, కనుక అప్పటి వరకు ధమాకా సినిమా తో రవితేజ సందడి చేయడం ఖాయం.తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున వసూళ్లు నమోదు అవుతున్నాయి.
కానీ అమెరికా లో మాత్రం ఇప్పటి వరకు కేవలం ఆరు లక్షల డాలర్లు మాత్రమే వసూళ్లు అవ్వడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
ఇక్కడ 100 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టిన సినిమా అక్కడ మినిమమ్ గా మిలియన్ డాలర్ల కలెక్షన్స్ నమోదు చేయక పోవడం ఆశ్చర్యంగా ఉంది అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.అమెరికా లో మాస్ ఆడియన్స్ ఎక్కువగానే ఉంటారు.ఇక్కడ సినిమా లు సక్సెస్ అయినా కాకున్నా కూడా కొన్ని సినిమా లు అక్కడ మంచి కలెక్షన్స్ రాబడుతున్నాయి.
కానీ ధమాకా సినిమా ఇక్కడ సక్సెస్ సంతోషాన్ని కలిగిస్తున్నా అక్కడ ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్టక పోవడానికి కారణం ఏమై ఉంటుంది అంటూ సినీ విశ్లేషకులు విశ్లేషించాల్సి ఉంది.పెద్ద ఎత్తున ధమాకా సినిమా రాబడుతున్న కలెక్షన్స్ ఒక వైపు సంతోషాన్ని కలిగిస్తుంటే మరో వైపు అమెరికా లో కనీసం మిలియన్ డాలర్ల వసూలు నమోదు చేయలేక పోయినందుకు నిరుత్సాహంగా ఉందని నిర్మాతలు చెబుతున్నారు.
రవితేజ ముందు ముందు అయినా అమెరికాలో సక్సెస్ అయ్యేనా చూడాలి.