ట్రెక్కింగ్ చేసే వారు కొనుగోలు చేసే సూపర్ మార్కెట్ ఎప్పుడైనా చూశారా..?

కిరణాం దుకాణాలు ఎక్కువగా జనాలు రద్దీగా ఉండే ప్రాంతాలలో, మెయిన్ రోడ్లపై, ప్రధాన కూడళ్ల వద్ద ఉంటాయని అందరికీ తెలిసిందే.ఎక్కడో మారుమూల ప్రాంతంలో షాప్ పెట్టుకుంటే ఇక బిజినెస్ జరిగినట్టే.

 Have You Ever Seen A Supermarket Where Trekkers Shop , Hunan Province, Trekkers-TeluguStop.com

కాబట్టి బాగా బిజినెస్ జరిగే ప్రాంతాలలోనే కిరాణం దుకాణాలు ఉంటాయి.

అయితే చైనాలోని( China ) ఒక వ్యక్తి మాత్రం అత్యంత భయంకరమైన ప్రదేశంలో ఓ భారీ కొండ మధ్యలో వేలాడుతూ ఉండే దుకాణాన్ని ఏర్పాటు చేసుకున్నాడు.ఈ దుకాణంలో ఏవైనా వస్తువులు కొనుగోలు చేసి తిరిగి వెళ్ళడం అసాధ్యం.ఆ దుకాణం కేవలం ట్రెక్కింగ్ చేసేవారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ దుకాణం చైనాలోని హునాన్ ప్రావిన్స్ లోని పింగ్ జియాంగ్ కౌంటీలోని( Pingxiang County ) Xinyuzhai నేషనల్ జియో లాజికల్ పార్క్ లో ఏర్పాటు చేశారు.పర్వతం మధ్యలో కనిపించే ఈ షాపు ఒక చెక్క పెట్టే ఆకారంలో ఉంటుంది.

ట్రెక్కింగ్ చేసేవారికి అవసరమైన వస్తువులను ఈ షాపులో విక్రయిస్తారు.చైనాలోని హునాన్ ప్రావిన్స్( Hunan Province ) లో ఉండే ఈ దుకాణం 120 మీటర్ల ఎత్తులో అంటే 393 అడుగుల ఎత్తులో కొండకు మధ్యలో ఉంటుంది.ఈ దుకాణానికి సరుకులను జిప్ లైన్ ద్వారా చేరవేస్తారు.ఈ దుకాణంలో ట్రెక్కింగ్ చేసే వారికి అవసరమయ్యే స్నాక్స్, కూల్ డ్రింక్స్ దొరుకుతాయి.ఈ దుకాణానికి సంబంధించిన ఫోటోలు @gunsnrosesgirl3 అనే ట్విట్టర్ హ్యాండిల్ లో షేర్ అయ్యాయి.ఈ పోస్ట్ దాదాపుగా 4.5 లక్షలకు పైగా వ్యూస్ దక్కించుకుంది.దీనిని చూసిన నెటిజన్స్ అంతా ఇది చాలా క్రేజీ ఐడియా, ఆ షాప్ లో షాపింగ్ చేయాలంటే చాలా ప్రత్యేకమైన టాలెంట్ ఉండాలి లాంటి కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube