సమోసా( Samosa ) భారతదేశంలో ఎంత పాపులర్ అయిందో స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు.భారతదేశంలో ఏ మూలకు వెళ్లినా ఈ టేస్టీ ఐటమ్ కనిపిస్తుంది.
సాధారణంగా ఆలుగడ్డ, ఉల్లిగడ్డలతో ఫిల్ చేసే సమోసాలను ఈవినింగ్ స్నాక్స్ గా చాలామంది తినేస్తుంటారు.చాలా మంది భారతీయులు సమోసాలను వేడి వేడి చట్నీతో తినడానికి ఇష్టపడతారు.
సమోసాలు రుచికరమైనవి మాత్రమే కాదు, నోస్టాల్జిక్ కూడా.అంటే అవి భారతీయులకు వారి బాల్య స్మృతులను గుర్తుచేస్తాయి.
సమోసాలు అనేక పండుగలు, వేడుకలలో భాగం.అయితే సమోసాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు.
కొంతమంది వివిధ ఫిల్లింగ్స్‌తో ప్రయోగాలు చేయడానికి ఇష్టపడతారు.వారు ఫిల్లింగ్స్‌గా నూడుల్స్, జున్ను, మొక్కజొన్న, పనీర్, ఇతర పదార్థాలను ఉపయోగిస్తారు.
అయితే వీటన్నిటిలో చైనీస్ సమోసా( Chinese samosa ) భారతీయులను బాగా ఆకట్టుకుంటుంది.దాని లోపల నూడుల్స్, కూరగాయలు ఫిల్ చేసే చైనీస్ వంటకాలు వేడివేడిగా సర్వ్ చేస్తున్నారు.
ఇది కారంగా, క్రంచీగా ఉంటుంది.దీనికి సంబంధించి ఒక ఫొటో కూడా వైరల్ గా మారింది.
కొంతమంది ఈ చైనీస్ సమోసాను ఒక్కసారైనా టేస్ట్ చేయాలని ఆశిస్తున్నట్లు వీడియో పోస్ట్ కింద పేర్కొన్నారు.ఇది భారతీయ, చైనీస్ వంటకాల టేస్టీ కాంబో అని వారు అభిప్రాయపడ్డారు.సాధారణ పొటాటో సమోసా కంటే ఇది బెటర్ అంటున్నారు.అయితే కొంతమంది మాత్రం చైనీస్ సమోసాను అసహ్యించుకుంటారు.‘X’ అనే సోషల్ మీడియా( Social media ) సైట్‌లో ఈ చైనీస్ సమోసా చిత్రాన్ని పోస్ట్ చేశారు.పోస్ట్ చేసిన వారికి చైనీస్ సమోసా నచ్చలేదు.
అయితే ఈ పోస్ట్ ఆన్‌లైన్‌లో తీవ్ర చర్చకు తెరలేపింది.ఈ పోస్ట్‌పై చాలా మంది కామెంట్స్ చేశారు.ఈరోజు మనం తినే సమోసా పర్షియన్ వంటకం నుంచి వచ్చిందని ఒక వ్యక్తి చెప్పాడు.పెర్షియన్ వంటకం లోపల బంగాళదుంపలు కాకుండా మాంసం ఉంటుందని తెలిపాడు.కాలానుగుణంగా, ప్రాంతాన్ని బట్టి సమోసా మారిందని వివరించాడు.చైనీస్ సమోసా స్టుపిడ్ కాదని, అది సమాసాలు ఒక రకం అని మనం అంగీకరించాలని కోరాడు.
ఏది ఏమైనా ఈ చైనీస్ సమోసా ఫొటో 3,50,000కు పైగా వ్యూస్‌తో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.