టార్గెట్ పురందేశ్వరి.. వైసీపీ సక్సెస్ అయిందా ?

ఈ మద్య ఏపీ రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి.ఏపీలో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికి పార్టీలు మాత్రం ఇప్పటి నుంచే సమరశంఖం పూరిస్తున్నాయి.

 Has Ycp Targeted Purandeswari , Bjp Party , Ycp , Cm Jagan, Purandeswari , T-TeluguStop.com

అయితే ఏపీ రాజకీయాలు ఎక్కువగా వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీల చుట్టూ మాత్రమే తిరుగుతూ ఉంటాయి.కానీ ఈ మద్య బీజేపీ కూడా వార్తల్లో నిలుస్తోంది.

దీనికి కారణం అధికార వైసీపీ నేతలు ఎక్కువగా బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిని( Purandeswari ) టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడమే.దీంతో ఏపీలో ఏ మాత్రం బలం లేని బీజేపీని వైసీపీ నేతలు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ? పురందేశ్వరి పై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శల్లో ఆంతర్యం ఏంటి ? ఇలాంటి ప్రశ్నలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.నిజానికి పురందేశ్వరి ( Purandeswari )బీజేపీ అధ్యక్ష పదవి చేపట్టిన తరువాత ఆ పార్టీలో కొత్త ఉత్సాహం కనిపించింది.

Telugu Ap, Av Subba Reddy, Chandrababu, Cm Jagan, Janasena, Purandeswari-Politic

ఆమె తరచూ పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహించడం, వైసీపీపై తనదైన రీతిలో విమర్శలు గుప్పించడం వంటివి చేస్తూ వచ్చారు.ఇన్నాళ్ళు బీజేపీని లైట్ తీసుకున్న వైసీపీ( YCP ) పురందేశ్వరి చేస్తున్న విమర్శలకు సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఇకపోతే ఇటీవల పురందేశ్వరి టీడీపీ విషయంలో కొంత సానుకూలంగా కనిపిస్తూ వచ్చారు.

చంద్రబాబు నాయుడు అరెస్ట్ ను ఖండించడం, చంద్రబాబు నాయుడుతో కలిసి డిల్లీ బీజేపీ పెద్దలతో సమావేశం నిర్వచించడం వంటివి చేస్తూ వచ్చారు.దీంతో వైసీపీకి ఈ వ్యవహారం ఉతమిచ్చినట్లైంది.

పురందేశ్వరి టీడీపీ కోవర్ట్ లా మారిపోయారని, చంద్రబాబు కోసం ఆమె పని బీజేపీని తాకట్టు పెడుతున్నారని ఈ రకమైన విమర్శలు చేస్తున్నారు వైసీపీ నేతలు.

Telugu Ap, Av Subba Reddy, Chandrababu, Cm Jagan, Janasena, Purandeswari-Politic

ఈ విమర్శల తాకిడి ఏపీ బీజేపీ నేతల్లో కూడా కలవరాన్ని కలిగిస్తున్నాయి.ఎందుకంటే టీడీపీతో ఎలాంటి పొత్తు లేదని బీజేపీ అధిష్టానం పదే పదే చెబుతున్నప్పటికి పురందేశ్వరి మాత్రం టీడీపీ విషయంలో సానుకూలంగా ఉంటువుండడంతో ఆమె నిజంగానే టీడీపీ కోవర్ట్ గా ఉన్నారా అనే సందేహాలు బీజేపీ నేతల్లో వ్యక్తమౌతోందట.ఈ నేపథ్యంలో స్వయంగా బీజేపీ నేత ఏవీ సుబ్బారెడ్డి.

( AV Subba Reddy ).పురందేశ్వరి గురించి ప్రస్తావిస్తూ ఆమె టీడీపీ కోవర్ట్ ల పని చేస్తున్నారని వ్యాఖ్యానించడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది.మొత్తానికి వైసీపీ విమర్శల కారణంగా బీజేపీలో ముసలం మొదలైందనే చెప్పాలి.పురందేశ్వరి దూకుడుకు చెక్ పెట్టేందుకు వైసీపీ నేతలు వేసిన ప్లాన్స్ వర్కౌట్ అయ్యాయనే చెప్పాలి.మరి ఈ పరిణామాలు పురందేశ్వరి పై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube