భారత క్రికెట్ వర్గాలలో వినిపిస్తున్న కొత్త ప్రశ్న ఇది .నిలకడైన ఆటతీరుతో , తనకు మాత్రమే సొంతమైన సొగసైన ఆట తీరుతో భారత క్రికెట్ భవిష్యత్తు తానేనని గిల్ ఇప్పటికే సంకేతాలు ఇచ్చాడు.
అయితే నిన్న జరిగిన ఐపీఎల్ వేదికగా ముంబైతో ( Mumbai )జరిగిన ఎలిమినేటర్( Qualifier2 ) మ్యాచ్లో గిల్ విధ్వంసకరమైన ఆట తీరు చూసిన వారికి భారత క్రికెట్ చరిత్రలో గిల్ ( Shubman Gill )శఖం మొదలైంది అన్న సంకేతాలు వచ్చాయి .ఒకప్పుడు భారత్ క్రికెట్ బాధ్యతలను దశాబ్దాలు పాటు మోసిన సచిన్ టెండూల్కర్( Sachin tendulkar ) భారత క్రికెట్ ను దేవుడి గా వెలుగొందాడు .ఎంతమంది అవుట్ అయిపోయిన సచిన్ ఉంటే చాలు మ్యాచ్ గెలుస్తామని నమ్మే జనాభా కోట్లలో ఉండేవారు.టీం మొత్తం విఫలమైన కూడా తన నిలకడ అయిన ఆట తీరుతో ఎన్నో మ్యాచులు గెలిపించిన సచిన్ భారత క్రికెట్పై తనదైన ముద్ర వేశారు.
సచిన్ విరమణ తర్వాత ఆ వారసత్వం అందుకున్న విరాట్ కోహ్లీ( Virat kohli ) ఒక దశాబ్దం పాటు తనదైన ముద్ర వేశాడు.సచిన్ కి అసలైన వారసుడు తానేనని నిరూపించుకున్న కోహ్లీ భారత క్రికెట్ లో ఒక మిషన్ లాగా పరుగులు వరద పాటించాడు.తన అగ్రెసివ్ ఆట తీరుతో కొంత విమర్శలు పాలైనప్పటికీ కూడా తనను మించిన బ్యాట్స్మెన్ సమకాలీన క్రికెట్లో లేడని నిరూపించుకోగలిగాడు.అయితే ఇప్పుడు కొత్త వారసుడికి రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తుంది.
కేవలం 22 సంవత్సరాల వయసులోనే ఇంత నిలకడైన ఆట తీరు , సంప్రదాయ ఆటకు ఆదునికత జోడించి అతను కొడుతున్న షాట్ లు చూస్తున్న ప్రేక్షకులు పారవశ్యానికి లోనవుతున్నారు.అసలైన క్రికెట్ మజాను అందిస్తున్న గిల్ భారత క్రికెట్ భవిష్యత్తుకు కచ్చితంగా మరో శిఖరం గా ఎదుగుతున్నాడని చెప్పవచ్చు.
ఇక సచిన్ ,కోహ్లీల వారసత్వాన్ని కొనసాగించే శుబమన్ గిల్ అని క్రికెట్ అభిమానులతో పాటు ప్రపంచ క్రికెట్ విశ్లేషకులు కూడా ఫిక్స్ అయిపోయారు ఇదే ఆట తీరును భవిష్యత్తులో కొనసాగిస్తే మాత్రం కొన్ని తరాలపాటు క్రికెట్ ప్రపంచానికి యువరాజు గా గిల్ తన ప్రస్థానాన్ని కొనసాగించే అవకాశం ఉంది .