ఏపీలో జనసేన బీజేపీ పార్టీల మధ్య పొత్తు వ్యవహారం పై చాలా కాలం నుంచి రకరకాల ప్రశ్నలు తెరపైకి వస్తూనే ఉన్నాయి.ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నా.
ఎవరికి వారు విడివిడిగా ఉంటూ తమ పార్టీ కార్యక్రమాలు చేపడుతూ ఉండడం, ఉమ్మడిగా రెండు పార్టీలు కలిసి ఏపీలో ప్రజా పోరాటాలు చేపట్టకపోవడం, ఒక పార్టీ కార్యక్రమాలకు మరొకరికి ఆహ్వానాలు పంపక పోవడం ఇలా ఎన్నో అంశాలు ఈ పొత్తు పై మరిన్ని అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.తెలంగాణలో జనసేన పార్టీ ఉన్నా, అక్కడ బిజెపి నాయకులు జనసేన తో పొత్తు తమకు అవసరం లేదు అన్నట్లు వ్యవహరిస్తున్నారు.
దీనిపై ఇప్పటికే ఆ పార్టీ నాయకులు అనేక వ్యాఖ్యలు చేసి పవన్ ఆగ్రహానికి గురయ్యారు.
కానీ ఏపీ బిజెపి నేతలు మాత్రం పవన్ తమతోనే ఉంటాడని, తమ రెండు పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తాయని, అవసరమైతే పవన్ కళ్యాణ్ ను సీఎం అభ్యర్థిగా తమ రెండు పార్టీల తరపున ప్రకటిస్తామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వంటివారు ప్రకటనలు చేస్తూనే ఉన్నారు.
అయినా ఈ రెండు పార్టీల మధ్య పొత్తు వ్యవహారం పై అనేక అనుమానాలు ఉన్నాయి.తాజాగా బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ కు వచ్చినా, పవన్ ఆయన ను కలిసేందుకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం తో దీనిపై మరిన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి.
జనసేన తో కలిసి ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ నేతలు ఆశపడుతున్నారు జనసేన మాత్రం బీజేపీ తో కలిసి ఎన్నికల్లో పోటీచేసినా, తమకు కలిసి వచ్చేది ఏమీ ఉండదని, పైగా ఆ పార్టీ భారం మొత్తం తామే మోయలి అనే అభిప్రాయంలో ఉన్నారట.బీజేపీ కలుపుకుని వెళ్లేందుకు జనసేన కానీ , ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కానీ ఇష్ట పడడం లేదట.

ఏపీలో ఎన్నికల సమయం దగ్గరకు వస్తున్న క్రమంలో జనసేన రాజకీయంగా స్పీడ్ పెంచింది.క్షేత్రస్థాయి నుంచి పట్టు పెంచుకునే విషయాలపై ఎక్కువగా దృష్టి సారించింది.ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ప్రజల్లో బలం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.ఇటీవల ఏపీలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబం పవన్ కళ్యాణ్ పరామర్శించి.
బాధిత కుటుంబానికి లక్ష రూపాయలు చొప్పున సహాయాన్ని అందించారు.ఇది జనసేన కు రాజకీయంగా మైలేజ్ తీసుకువచ్చింది.
అయితే ఈ కార్యక్రమానికి బీజేపీకి ఆహ్వానాలు అందక పోవడం వంటి వ్యవహారాలు చూస్తే బీజేపీతో ఎంత తొందరగా పొత్తు రద్దు చేసుకుంటే అంత మంచిది అనే అభిప్రాయంలో జనసేన ఉన్నట్లుగా అర్థం అవుతోంది.







