ఫిదా సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన మలయాళ బ్యూటీ సాయి పల్లవి అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఈ తరం హీరోయిన్లలో ఈమె చాలా ప్రత్యేకమనే చెప్పాలి.
ఎందుకంటే వచ్చిన ప్రతి సినిమాను చేసేయకుండా సెలెక్టివ్ గా కథలను, పాత్రలను ఎంచుకుంటూ కెరియర్ ని కొనసాగిస్తున్నారు ఈ అమ్మడు.స్నేహ, కలర్స్ స్వాతి వంటి కొందరు హీరోయిన్ల బాటలోనే సాయి పల్లవి కూడా ప్రయాణిస్తోంది అని చెప్పొచ్చు.
ఎందుకంటే సినీ ఫీల్డ్ లోకి వచ్చినప్పటికీ తనకంటూ ఒక బౌండరీని ఏర్పాటు చేసుకుని ఆ పరిధిని దాటకుండా పాత్రలను ఎంచుకుంటూ ప్రత్యేకతను సంతరించుకుంది.
అందాల ఆరబోతకి దూరంగా ఉన్న స్టార్ హీరోయిన్ ల స్థాయిలో క్రేజ్ ను పెంచుకుంది.
అందాల ఆరబోతకు ఈమె ఆమడు దూరం, ఇప్పట్లో వస్తున్న చిత్రాల్లో ఈ తరం హీరోయిన్లు ఏ రేంజ్ లో గ్లామర్ పాత్రల్లో ఉర్రూతలూగిస్తున్నారో తెలిసిందే, నిజానికి ట్రెండ్ కూడా అలానే నడుస్తోంది.కానీ అందుకు సాయి పల్లవి పూర్తిగా భిన్నం.
గ్లామర్ పాత్రలకు నేను చాలా దూరం అని ముందుగానే దర్శకులతో చెప్పేస్తారట ఈ బ్యూటీ.అందమైన ఆహార్యం, మంచి డ్యాన్సర్, అదరహో అనిపించే నటనతో ప్రేక్షకులను అలరించే ఈ సుందరి తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.
కాగా ప్రస్తుతం టాలీవుడ్ లో సాయి పల్లవి జోరు బాగా తగ్గింది.

చేతిలో పెద్దగా సినిమాలు లేవు, అయితే ఒక్కసారిగా ఇలా అవకాశాలు తగ్గడానికి కారణం ఏమిటి అంటే వివరాలు ఇవి అని తెలుస్తున్నాయి.ప్రస్తుతం హీరోయిన్ సాయి పల్లవి చేతిలో ఒకే ఒక చిత్రం ఉంది.అయితే అది కూడా ఎప్పటిదో, అదేనండి అప్పుడెప్పుడో షూటింగ్ ని పూర్తి చేసుకున్న ‘విరాట పర్వం’ చిత్రం తప్ప సాయి పల్లవి చేతిలో మరే తెలుగు సినిమా లేదు.
మరో ప్రాజెక్ట్ కి కనీసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా కూడా లేదని సమాచారం.సెలెక్టివ్ గా పాత్రలను ఎంపిక చేసుకునే ఈ యంగ్ హీరోయిన్ తనకు నచ్చిన నప్పే పాత్రల కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది.
వాస్తవానికి ఈ మధ్య ఈమెకు చాలా ఆఫర్లు వచ్చాయి.కానీ అందులో గ్లామర్ కాస్త ఒలికించే పాత్రలు కావడంతో నో అని చెప్పేశారట సాయి పల్లవి.

వాటిలో ‘భోళా శంకర్’ సినిమా కూడా ఒకటి.ఈ సినిమాలో పాత్ర తనకు అంతగా నప్పదని భావించి రిజెక్ట్ చేశారట పల్లవి.అలా ఈమె చేతిలో ప్రస్తుతం కొత్త ప్రాజెక్టు లు ఏవీ లేవని తెలుస్తోంది.నాగ చైతన్యతో లవ్ స్టొరీ, నానితో శ్యామ్ సింగరాయ్ చిత్రాలతో వరుస హిట్లు అందుకున్నప్పటికీ, ఈమె మరో ప్రాజెక్ట్ చేయకపోవడంతో అభిమానులు నిరాశ పడుతున్నారు.
ఈ రెండు సినిమాలు మంచి విజయాన్ని సాధించడంతో ఇక సాయి పల్లవి కథలోకి వరుస క్రేజీ ప్రాజెక్టులు చేరుతాయని భావించిన ఆమె అభిమానులు ఇంకా అలాంటి వార్త రాకపోవడంతో చింతిస్తున్నారు.రేపోమాపో తన లేటెస్ట్ ప్రాజెక్ట్ ల గురించి ఏదైనా అప్డేట్స్ అందుతాయేమో అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
ఇక సాయి పల్లవి నటించిన విరాట పర్వం చిత్రం కూడా థియేటర్లో కాకుండా ఓటిటి లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని టాలీవుడ్ నుండి అందుతున్న సమాచారం.







