నిన్న మొన్నటి వరకు మాటల యుద్ధం ఇప్పుడు దాడుల వరకు తెలంగాణ రాజకీయం( Telangana Politics ) విస్తరించినట్లుగా కనిపిస్తుంది.నిన్న మొన్నటి వరకూ పరుష పదజాలాలకు మాత్రమే పరిమితమైన నేతలు ఎన్నికలకు దగ్గరికి వచ్చిన కొద్ది ప్రత్యర్థి పార్టీ నాయకులతోనూ కార్యకర్తలతోనూ బాహా బాహీ కి దిగుతున్న వాతావరణం కనిపిస్తుంది.
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో( Achampet Constituency ) కాంగ్రెస్ మరియు అధికార బీఆర్ఎస్ నేతల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.ఎన్నికల లో పంచడానికి డబ్బుల బ్యాగులు తరలిస్తున్నారనే అనుమానంతో ఒక వాహనంని కాంగ్రెస్ కార్యకర్తలు వెంబడించారు.

ఆ వాహనం అచ్చంపేట అధికార పార్టీ అభ్యర్థి గువ్వల బాలరాజు( Guvvala Balaraju ) ఉన్న ప్రాంతానికి వెళ్లడంతో వాహనాన్ని తనిఖీ చేయాల్సిందిగా కాంగ్రెస్ కార్యకర్తలు పట్టు పట్టారు.దాంతో అధికార అధికార పార్టీ శ్రేణులకు కాంగ్రెస్ శ్రేణులకు( Congress ) మధ్య తీవ్రస్థాయి వాగ్వాదం జరిగింది.ఇరు పార్టీలు రాళ్లతో దాడులు చేసుకున్నట్లు సమాచారం.ఆ దాడిలో అధికార పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గువ్వల బాలరాజుకు తీవ్ర గాయాలయ్యాయని, ఆయనను హైదరాబాదులో ఉన్న అపోలో ఆసుపత్రికి తరలించినట్లుగా తెలుస్తుంది.
ఇక్కడ దాడులు జరుగుతాయని తాము ముందు నుంచి చెబుతున్నా పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకోలేదని, బాలరాజు వర్గం ఆరోపిస్తుంది.

గెలుపు పై నమ్మకం లేకే కాంగ్రెస్ శ్రేణులు ఇలా బెదిరింపు దాడులకు దిగుతున్నాయని అధికార పార్టీ ఆరోపిస్తుంటే ,ఓడిపోతారనే భయంతో బీఆరఎస్ నాయకులు( BRS ) సెంటిమెంట్ డ్రామా ఆడుతున్నారంటూ కాంగ్రెస్ నాయకులు రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు.ఏది ఏమయినా గెలుపే లక్ష్యం గా అన్నీ పార్టీల నాయకులు సర్వ శక్తులు ఒడ్డడం తో చాలా ప్రాంతాలలో పరిస్తితి నివురు కప్పిన నిప్పులా ఉన్నట్టు కనిపిస్తుంది.ముఖ్యం గా అదికార బీఆరఎస్ మరియు కాంగ్రెస్ ల మధ్య పచ్చ గడ్డి వేస్తే బగ్గుమనే వాతావరణం కనిపిస్తుంది.