ప్రతిపక్ష నేత చంద్రబాబు అరెస్టు( Chandrababu arrest ) తర్వాత దేశవ్యాప్తం గా మద్దత్తు కూడగట్టడానికి ఢిల్లీ వెళ్ళిన ఆ పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్ చాలా కాలంగా ఢిల్లీ లోనే ఉండిపోవడంతో అధికార వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా అనేక విమర్శలు చేస్తుంది .ఆంధ్రకు వస్తే అరెస్టు చేస్తారనీ భయపడి ఢిల్లీలో దాక్కున్నారంటూ వైసీపీ నేతలు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు అయితే యువగళం పాదయాత్ర( Yuva Galam )ను మరొకసారి మొదలు పెట్టాలని భావిస్తున్న లోకేష్ వచ్చే వారంలో ఆంధ్రప్రదేశ్ కు రావడానికి ఏర్పాట్లు చేసుకోగానే మరోసారి లోకేషన్ అరెస్టు చేయడానికి రంగం సిద్ధమైనట్లుగా కనిపిస్తుంది.
అమరావతి రింగ్ రోడ్ అలైన్మెంట్లో అవకతవకల కేసులో లోకేష్ ను ఏ- 14 గా చూపిస్తూ సిఐడి ఏసిబి కోర్టులో మెమో దాఖలు చేసింది.దాంతో అక్టోబర్ 2 తారీకున పాదయాత్రను పున:ప్రారంభించాలని చూస్తున్న లోకేష్ ను యాత్ర ప్రారంభించకుండానే అరెస్టు చేసే అవకాశం కనిపిస్తుందని వార్తలు వస్తున్నాయి .
ఇప్పటికే ఫైబర్ గ్రిడ్ కేసులో లోకేష్ ను( Nara lokesh ) ముద్దాయిగా చూపిస్తున్న సిఐడి ,ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో కూడా నిందితుల జాబితాలో చేర్చడం చూస్తుంటే కచ్చితంగా లోకేష్ ని అరెస్ట్ చేయడానికి ప్లాన్ సిద్ధమైనట్లుగా తెలుస్తుంది .చంద్రబాబు అరెస్టుతో వస్తున్న రాజకీయ పరిణామాలను గమనిస్తూ కూడా లోకేష్ అరెస్ట్ కి అదికార వైసిపి( YCP ) ప్రయత్నిస్తున్నదంటే తెలుగుదేశానికి వస్తున్న సానుభూతి ఎన్నికలలో వర్కౌట్ అవ్వదని వైఎస్ఆర్సిపి నమ్ముతున్నట్లుగానే తెలుస్తుంది.అలిపిరి ఘటన తరువాత చంద్రబాబుకు ఎన్నికల లో మైలేజ్ దక్కక పోవడం, 16 నెలలు జైలులో ఉన్నా కూడా జగన్ మొదటిసారి గెలవకపోవటం వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్న వైసీపీ అధినాయకత్వం అరెస్టులు, కోర్టులు ప్రజలు మనసును మార్చలేవని నిర్ణయించుకున్నట్లే తెలుస్తుంది .
ఏది ఏమైనా ఎన్నికల దగ్గరలో ఉన్న ప్రస్తుత పరిస్థితులలో కూడా ఎక్కడా వెనక్కు తగ్గకుండా దూసుకెళ్తున్న వైసీపీ సర్కార్ దానికి తగిన మూల్యం చెల్లించుకుంటుందా లేదా తన నమ్మకమే నిజం అని నిరూపించుకుంటుందా అన్నది భవిష్యత్ తరాలకు ఒక గుణ పాఠం గా మిగిలి పోతుందేమోచూడాలి .