జనసేన అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) వచ్చే ఎన్నికలపై గట్టిగా దృష్టి పెట్టారు.పార్టీ స్థాపించి పదేళ్ళు గడిచిన ఇంతవరుకు బలమైన పార్టీగా గుర్తింపు రాకపోవడంతో ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటి జనసేన ముద్ర వేయాలని భావిస్తున్నారు.
అందుకు తగ్గట్టుగానే వ్యూహాలు రచిస్తూ ముందుకు సాగుతున్నారు.వచ్చే ఎన్నికల్లో వైసీపీని గద్దె దించడమే తన లక్ష్యమని, అందుకోసం తాను ఏం చేయడానికైనా సిద్దమే అని ఇప్పటికే పలుమార్లు చెప్పుకొచ్చారు పవన్.
అందుకే వైసీపీని ఒంటరిగా ఢీ కొట్టి నిలవడం సాధ్యం కాదని గ్రహించి పొత్తుకు సై అనే సిగ్నల్ ఇచ్చారు.ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉన్న పవన్.
టీడీపీతో కూడా పొత్తును బలంగా కోరుకున్నారు.కానీ బీజేపీ( BJP party ) మరియు టీడీపీ ( TDP party )మద్య సత్సంబంధాలు లేకపోవడంతో ఈ రెండు పార్టీల కలయిక జరిగేలా కనిపించడం లేదు.
ఈ నేపథ్యంలో పవన్ ప్లాన్ బి అమలు చేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది.ప్రస్తుతం బీజేపీతో ఉన్న పొత్తును అలాగే కొనసాగిస్తూ జనసేన బలంగా ఉన్న స్థానాలలో అభ్యర్థులను ప్రకటించే ప్లాన్ లో ఉన్నారట.ఇప్పటికే ఉభయగోదావరి జిల్లాలల్లో అభ్యర్థులను దాదాపు ఖాయం చేసినట్లు తెలుస్తోంది.జనసేన బలంగా ఉన్న స్థానాలలో ముందుగా అభ్యర్థులను ప్రకటించడం వల్ల.ఒకవేళ టీడీపీతో పొత్తు కుదిరినప్పటికి ఆ స్థానాలు జనసేన రిజర్వ్ చేసుకోవడం వల్ల టీడీపీ వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
అలా కాకుండా టీడీపీతో ఎలాంటి పొత్తు లేకపోతే.జనసేన( Janasena party ) బీజేపీ( BJP party )తో కలిసి ముందుగా ప్రకటించిన స్థానాలలో సత్తా చాటే అవకాశం ఉంది.అందుకే ప్రస్తుతం పొత్తు విషయాన్ని ఆలోచించకుండా అభ్యర్థుల ఎంపిక పై పవన్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
మరి అధికారమే లక్ష్యంగా ఉన్న పవన్ ఒకవేళ ఒంటరిగా బరిలోకి దిగితే ఎంతమేర సత్తా చాటుతారు అనేది ప్రశ్నార్థకమే ? ఎందుకంటే జనసేనతో ఆల్రెడీ పొత్తులో ఉన్న బీజేపీకి రాష్ట్రంలో పెద్దగా ఆధారణ లేదు.కాబట్టి పూర్తి భారమంతా జనసేన పైనే ఉంటుంది.
అయితే పవన్ ఒంటరిగా బరిలోకి దిగితే అటు టీడీపీ ఓటు బ్యాంకు, ఇటు వైసీపీ ఓటు బ్యాంకు లలో భారీగా చీలిక ఏర్పడే అవకాశం ఉంది.మరి పవన్ ఎలా అడుగులేస్తారో చూడాలి.