టీడీపీ ప్లాన్.. షురూ !

ఏపీలో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని తెలుగుదేశం పార్టీ గట్టి పట్టుదలగా ఉంది.గత ఎన్నికల్లో ఆ పార్టీ ఎదుర్కొన్నా ఓటమి నేతల్లోని, కార్యకర్తల్లోని ఆత్మస్థైర్యాన్ని గట్టిగానే దెబ్బ తీసింది.

 Has Chandrababu Made A Master Plan? ,chandrababu Naidu, 2024 Elections, Nara Lok-TeluguStop.com

ఎందుకంటే మొదటి నుంచి సంచలనాలకు మారుపేరుగా నిలిచిన టీడీపీ గత ఎన్నికల్లో కేవలం 23 సిట్లకే పరిమితం కావడం అసలు జీర్ణించుకోలేని విషయం.ఆ ఓటమి టీడీపీని ఎంతలా దెబ్బ తీసిందంటే సొంత పార్టీ నేతలే పార్టీ పనైపోయిందనే చెప్పే పరిస్థితికి చేరింది.

దీంతో పార్టీ తిరిగి పూర్వ వైభవం పొందాలన్నా, పార్టీ ఉనికి నిలుపుకోవాలన్నా 2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి.

Telugu Ap, Chandrababu, Lokesh, Tdp Manifesto, Ys Jagan-Politics

దాంతో అటు అధినేత చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ), ఇటు ఆయన తనయుడు నారా లోకేశ్( Nara lokesh ) అలుపెరగకుండా పార్టీ బలోపేతం కోసం కష్టపడుతూ నేతల్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఎన్నికలకు ఇంకా పది నెలలు సమయం ఉన్నప్పటికి ఎవరు ఊహించని విధంగా మినీ మేనిఫెస్టోను( TDP manifesto ) ప్రకటించి ఒక్కసారిగా అందరి దృష్టిని టీడీపీ వైపు తిప్పుకునేలా చేశారు చంద్రబాబు నాయుడు.మేనిఫెస్టోలోని కొన్ని అంశాలు కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ మేనిఫెస్టోను పోలిఉన్నప్పటికి ప్రజలను మాత్రం గట్టిగానే ఆకర్షిస్తోంది.

Telugu Ap, Chandrababu, Lokesh, Tdp Manifesto, Ys Jagan-Politics

దీంతో ప్రస్తుతం ప్రకటించిన ఈ మినీ మేనిఫెస్టోను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెల్లే విధంగా పక్క ప్రణాళిక రచిస్తున్నారు అధినేత చంద్రబాబు నాయుడు.మంగలగిరిలోని టీడీపీ కార్యలయంలో నేడు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు.ఈ సమావేశానికి పొలిట్ బ్యూరో సభ్యులు, నియోజిక వర్గ ఇంచార్జ్ లు, పార్టీలోని కీలక నేతలు హాజరు కానున్నారు.రాష్ట్రంలోని 175 నియోజిక వర్గాల్లో బస్సు యాత్రలు, ప్రచార కార్యక్రమాలు చేపట్టి.

ప్రస్తుతం ప్రకటించిన మేనిఫెస్టోను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెల్లే విధంగా ప్రణాళిక రచించారు.ఇకపై ఎక్కడ టీడీపీ కార్యక్రమం నిర్వహించిన ఆ కార్యక్రమంలో మేనిఫెస్టోనే హైలెట్ అయ్యే విధంగా చూసుకొనున్నారు.

మొత్తానికి ఎన్నికలే టార్గెట్ గా చంద్రబాబు.తన ప్లాన్స్ ను షురూ చేసినట్లే కనిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube