యూట్యూబ్ హర్ష సాయి( Harsha Sai ) తెలియని వారంటూ ఎవరూ ఉండరు.హర్ష సాయి యూట్యూబ్ వీడియోలను చేస్తూ యూట్యూబ్ ద్వారా వచ్చిన సంపాదనను తిరిగి ఇతరులకు పంచుతూ దానిని వీడియోగా చేసి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేస్తూ ఉంటారు.
ఇలా ఈయన యూట్యూబ్ నుంచి వచ్చిన ఆదాయం మొత్తం కటిక పేదలకు పంచుతూ వారి కళ్ళల్లో ఆనందాన్ని చూస్తూ ఉంటారు.ఇలా ఎంతోమందికి సహాయం చేసినటువంటి హర్ష సాయి ఎంతో మంది అభిమానులను కూడా సొంతం చేసుకున్నారు.
ఇలా ఈయనకు ఉన్నటువంటి ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్టిలో పెట్టుకొని ఏకంగా సినిమాలలోకి కూడా వచ్చారు.

ఈ క్రమంలోనే హర్ష సాయి తన మొదటి సినిమా మెగా -లో డాన్( Mega Lo Don ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.తాజాగా ఈ సినిమా టైటిల్ టీజర్ ( Teaser )కూడా విడుదలైన సంగతి తెలిసిందే.టీజర్ కు మంచి స్పందన కూడా వస్తుంది.
అయితే ఈ వేదికపై హర్ష సాయి మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు.తాను ఈ సినిమా ఫంక్షన్ కి రావడం కోసం హోటల్ నుంచి బయటకు వస్తూ ఉండగా ఒక వ్యక్తి తనని పలకరించారు.
నేను మీ అభిమానిని మీరు సినిమా చేస్తున్నారు కదా ఆ సినిమాలో మీరు ఎలా ఉంటారో చూడవచ్చా అని అడగడంతో తనకు నేను ఈ టీజర్ చూపించాను.

ఇలా చూసినటువంటి ఆ వ్యక్తి చాలా బాగుంది.అయినా మీరు సినిమాలలో ఎందుకు నటిస్తున్నారు మీకేంటి అవసరమని నన్ను ప్రశ్నించారు.ఆ వ్యక్తికి చెప్పిన సమాధానమే ఇక్కడ కూడా చెప్పాలనుకుంటున్నాను అంటూ ఈయన మాట్లాడారు.
మీరు చిన్నప్పుడు పాఠాలు నేర్చుకున్నారు కదా అవి గుర్తు ఉన్నాయా అని అక్కడికి వచ్చినటువంటి అభిమానులను అడిగారు లేదు అని సమాధానం చెప్పారు.పోనీ కాకి నీరు కథ గుర్తుందా అంటే గుర్తుందని అందరూ సమాధానం చెప్పారు.
పాఠాలు ఎవరికి గుర్తుండవు కథలు సినిమాలే గుర్తుంటాయి అందుకే ఒక మంచి సినిమా చేయాలని నేను ఇక్కడికి వచ్చాను.సినిమాలు చేసుకుంటూ పోతే డబ్బు వస్తాయి.ఎవరికైనా ఇవ్వాలి అంటే మనకు కూడా డబ్బు అవసరమే కదా అంటూ ఈ సందర్భంగా హర్ష సాయి( Harsha Sai ) చేస్తున్నటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
