Harry Potter Wand : కత్తితో వ్యక్తి కలకలం.. హోటల్‌పై రైడ్ చేసిన యూకే పోలీసులకు ఊహించని షాక్..

ఇటీవల ఇంగ్లాండ్‌లోని( England ) ఓ హోటల్‌కు ఓ వ్యక్తి పెద్ద ‘కత్తి లాంటి ఒక వస్తువుతో వచ్చాడు.ఆ వస్తువును చూసి చాలా మంది భయంతో వణికి పోయారు.

 Harry Potter Fan Sparks Firearms Police Swoop After Wand Mistaken For Knife In-TeluguStop.com

అతడు కత్తితో( Knife ) లిఫ్ట్‌ల దగ్గర నడుస్తూ ఉండటం చూసి కొందరు పోలీసులకు ఫోన్ చేశారు.హోటల్‌లో( Hotel ) ఓ వ్యక్తి కత్తితో తిరుగుతున్నాడని వారు చెప్పారు.

దాంతో అప్రమత్తమైన పోలీసులు తుపాకులతో సహా హుటాహుటిన హోటల్ వద్దకు వచ్చారు.కత్తితో ఉన్న వ్యక్తిని వారు చాకచక్యంగా పట్టుకున్నారు.

కానీ అతడిని పట్టుకున్న తర్వాత వారికి ఒక ఊహించని షాక్‌ తగిలింది.అదేంటంటే ఆ ‘కత్తి’ అస్సలు కత్తి కాదు.ఇది హ్యారీ పోటర్( Harry Potter ) అభిమానుల కోసం తయారు చేసిన ఒక మంత్రదండం.( Wand ) ఆ వ్యక్తి హ్యారీ పోటర్‌కి అభిమాని.

అతను ఈ బొమ్మ మంత్రదండాన్ని పట్టుకొని మాంత్రికుడిలా నటించడానికి ఇష్టపడ్డాడు.అందుకే దానిని కొనుగోలు చేశాడు.

దీని గురించి తెలిసిన తర్వాత పోలీసులు ఆశ్చర్యపోయారు, తర్వాత నవ్వుకున్నారు.

Telugu Big Knife, England, Hotel, Latest, Nri, Uk, Wand Knife-Telugu NRI

ఎవరూ గాయపడకపోవడంతో పోలీసులు( Police ) ఆనందం వ్యక్తం చేశారు.వారు దీనిని తమాషాగా భావించారు.ఈ మేరకు వారు ఫేస్‌బుక్‌లో ఓ మెసేజ్ పెట్టారు.

వారు హోటల్‌లో ‘వోల్డ్‌మార్ట్’ చూడలేదని చెప్పారు.హ్యారీ పోటర్‌లో వోల్డ్‌మార్ట్ చెడ్డ వ్యక్తి.

అయితే అది ఏ హోటల్ అని వారు చెప్పలేదు.ఫేస్‌బుక్‌లో పోలీసులు చేసినా పోస్ట్ చూసి నెటిజన్లు బాగా నవ్వుకున్నారు.

Telugu Big Knife, England, Hotel, Latest, Nri, Uk, Wand Knife-Telugu NRI

చాలా మంది చూశారు.కొందరు హ్యారీ పోటర్ గురించి జోకులు వేశారు.మంత్రదండం కొంటే కొన్నాడు కానీ హోటల్లో ఇలా అందరికీ చూపిస్తూ తిరగాలా? అనవసరంగా ప్రజల పోలీసుల సమయం వృధా కదా అని మరికొందరు వ్యాఖ్యానించారు.మరి ఆ వ్యక్తికి మొత్తానికి పోలీసులు ఏం వార్నింగ్ ఇచ్చారో తెలియ రాలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube