Harry Potter Wand : కత్తితో వ్యక్తి కలకలం.. హోటల్‌పై రైడ్ చేసిన యూకే పోలీసులకు ఊహించని షాక్..

ఇటీవల ఇంగ్లాండ్‌లోని( England ) ఓ హోటల్‌కు ఓ వ్యక్తి పెద్ద 'కత్తి లాంటి ఒక వస్తువుతో వచ్చాడు.

ఆ వస్తువును చూసి చాలా మంది భయంతో వణికి పోయారు.అతడు కత్తితో( Knife ) లిఫ్ట్‌ల దగ్గర నడుస్తూ ఉండటం చూసి కొందరు పోలీసులకు ఫోన్ చేశారు.

హోటల్‌లో( Hotel ) ఓ వ్యక్తి కత్తితో తిరుగుతున్నాడని వారు చెప్పారు.దాంతో అప్రమత్తమైన పోలీసులు తుపాకులతో సహా హుటాహుటిన హోటల్ వద్దకు వచ్చారు.

కత్తితో ఉన్న వ్యక్తిని వారు చాకచక్యంగా పట్టుకున్నారు.కానీ అతడిని పట్టుకున్న తర్వాత వారికి ఒక ఊహించని షాక్‌ తగిలింది.

అదేంటంటే ఆ 'కత్తి' అస్సలు కత్తి కాదు.ఇది హ్యారీ పోటర్( Harry Potter ) అభిమానుల కోసం తయారు చేసిన ఒక మంత్రదండం.

( Wand ) ఆ వ్యక్తి హ్యారీ పోటర్‌కి అభిమాని.అతను ఈ బొమ్మ మంత్రదండాన్ని పట్టుకొని మాంత్రికుడిలా నటించడానికి ఇష్టపడ్డాడు.

అందుకే దానిని కొనుగోలు చేశాడు.దీని గురించి తెలిసిన తర్వాత పోలీసులు ఆశ్చర్యపోయారు, తర్వాత నవ్వుకున్నారు.

"""/" / ఎవరూ గాయపడకపోవడంతో పోలీసులు( Police ) ఆనందం వ్యక్తం చేశారు.

వారు దీనిని తమాషాగా భావించారు.ఈ మేరకు వారు ఫేస్‌బుక్‌లో ఓ మెసేజ్ పెట్టారు.

వారు హోటల్‌లో 'వోల్డ్‌మార్ట్' చూడలేదని చెప్పారు.హ్యారీ పోటర్‌లో వోల్డ్‌మార్ట్ చెడ్డ వ్యక్తి.

అయితే అది ఏ హోటల్ అని వారు చెప్పలేదు.ఫేస్‌బుక్‌లో పోలీసులు చేసినా పోస్ట్ చూసి నెటిజన్లు బాగా నవ్వుకున్నారు.

"""/" / చాలా మంది చూశారు.కొందరు హ్యారీ పోటర్ గురించి జోకులు వేశారు.

మంత్రదండం కొంటే కొన్నాడు కానీ హోటల్లో ఇలా అందరికీ చూపిస్తూ తిరగాలా? అనవసరంగా ప్రజల పోలీసుల సమయం వృధా కదా అని మరికొందరు వ్యాఖ్యానించారు.

మరి ఆ వ్యక్తికి మొత్తానికి పోలీసులు ఏం వార్నింగ్ ఇచ్చారో తెలియ రాలేదు.

జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరగాలా.. అయితే ఈ సీరంను ట్రై చేయండి!