పవన్ కళ్యాణ్ రెండేళ్ళ గ్యాప్ తర్వాత మరల వకీల్ సాబ్ సినిమాతో సినిమాలు చేయడ్డం మొదలెట్టాడు.ఇదే స్పీడ్ లో వరుసగా సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.
అందులో క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా కాగా హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ లో ఒక సినిమా ఉండనుంది.ఇప్పటికే పవన్ కళ్యాణ్ సినిమాకి సంబందించి హరీష్ శంకర్ స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేసేశాడు.
అయితే ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది అనే విషయంలో స్పష్టత లేదు.లాక్ డౌన్ కారణంగా ఉన్న సినిమాలు అన్ని కూడా వాయిదా పడిపోయాయి.
ఇలాంటి టైంలో హరీష్ శంకర్ సినిమా సెట్స్ పైకి వెళ్ళడానికి మరో ఏడాది అయిన పడుతుందనే మాట వినిపిస్తుంది.
మరి ఈ లోపు హరీష్ శంకర్ చిన్న సినిమా ఏదైనా చేసే అవకాశం ఉందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఈ విషయంలో హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చేశాడు.పవన్ సినిమా అయ్యే వరకు వేరే సినిమా చేసే ఆలోచన లేదని స్పష్టం చేసారు.అయితే టైం ఉంటే మాత్రం ఒక వెబ్ సిరీస్ చేస్తానని వెల్లడించారు.ఈ మధ్య కాలంలో వెబ్ సిరీస్ లకు మంచి ఆదరణ లభిస్తుంది.
ఈ నేపధ్యంలో దర్శక, నిర్మాతలతో పాటు నటులు కూడా వెబ్ సిరీస్ ల బాట పడుతున్నారు.ఈ నేపధ్యంలో హరీష్ శంకర్ మంచి కమర్షియల్ వెబ్ సిరీస్ ఒకటి క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో ప్రారంబించడానికి రెడీ అవుతున్నట్లు ఆయన ప్రకటన బట్టి తెలుస్తుంది.