పవర్ స్టార్ డైరెక్టర్ తో బాలయ్య.. వర్కౌట్ అయ్యేనా?

బాలయ్య ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉండడంతో స్టార్ డైరెక్టర్లు సైతం ఈయనతో సినిమా చేయాలని పోటీ పడుతున్నారు.ఇటీవలే సంక్రాంతి బరిలో వీరసింహారెడ్డి సినిమాతో వచ్చి మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.

 Harish Shankar Aspires To Work With Balayya , Balakrishna, Anil Ravipudi, Harish-TeluguStop.com

దీంతో నందమూరి ఫ్యాన్స్ కూడా ఆనందంగా ఉన్నారు.ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు.

ఈ సినిమా ఇప్పటికే పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది.ఇక త్వరలోనే రెగ్యురల్ షూట్ స్టార్ట్ కాబోతుంది.ఈ సినిమాలో బాలయ్య కూతురు పాత్రలో శ్రీలీల కనిపిస్తుంది.వీరిద్దరి మధ్య కథ ఎమోషనల్ గా సాగబోతోంది.

ఈ సినిమాలో బాలయ్యను అనిల్ ఎలా చూపిస్తాడా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.మరి ఇదిలా ఉండగా బాలయ్య లైనప్ లో మరింత మంది డైరెక్టర్లు చేరిపోతున్నారు.

Telugu Anil Ravipudi, Balakrishna, Harish Shankar, Harishshankar, Pawan Kalyan,

తాజాగా డైరెక్టర్ హరీష్ శంకర్ సైతం బాలయ్యతో సినిమా చేయబోతున్న విషయం రివీల్ చేసాడు.వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో ఈ డైరెక్టర్ బాలయ్యతో సినిమా చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేసారు.త్వరలోనే బాలయ్య కోసం మంచి కథ రెడీ చేసి బాలయ్యకు వినిపించి ఆయనను ఒప్పించి మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఒక సినిమా చేస్తా అని హరీష్ శంకర్ శంకర్ చెప్పడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Telugu Anil Ravipudi, Balakrishna, Harish Shankar, Harishshankar, Pawan Kalyan,

మరి వీరిద్దరి కాంబోలో ఎప్పుడు సినిమా వస్తుందో అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.ఇక ప్రెజెంట్ హరీష్ శంకర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను ప్రకటించిన విషయం విదితమే.ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.

ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో హరీష్ శంకర్ బిజీగా ఉన్నారు.చూడాలి మరి పవర్ స్టార్ సినిమా అయ్యేలోపు బాలయ్య తన డేట్స్ ఇస్తాడో లేదో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube