పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) చేతిలో ప్రెజెంట్ చాలా ప్రాజెక్టులు ఉన్న విషయం తెలిసిందే.ఈయన ఎప్పుడు లేని విధంగా భారీ లైనప్ సెట్ చేసుకున్నాడు.
ఇక ఎన్నికల సమయం కంటే ముందే ఇప్పటి వరకు ప్రకటించిన సినిమాలను పూర్తి చేయాలని పవన్ గట్టి పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తుంది.ఈ క్రమంలోనే షూట్స్ ప్లాన్ చేసుకుంటున్నాడు.
ప్రెజెంట్ పవన్ కళ్యాణ్ క్రిష్( Krish ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు చివరి దశకు చేరుకుంది.ఈ సినిమా షూట్ పూర్తికాక ముందే మరిన్ని ప్రాజెక్టులు ప్రకటించాడు.
మరి పవర్ స్టార్ లైనప్ లో హరీష్ శంకర్( Harish Shankar ) కూడా ఉన్నాడు.ఇప్పటికే వీరి కాంబోలో గబ్బర్ సింగ్ అనే సూపర్ హిట్ సినిమా తెరకెక్కింది.
ఇక ఇదే కాంబోలో ఇప్పుడు మరో సినిమా రాబోతుంది అని పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

హరీష్ శంకర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ”ఉస్తాద్ భగత్ సింగ్” సినిమాను ప్రకటించిన విషయం విదితమే.ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో హరీష్ శంకర్ బిజీగా ఉన్నారు.
అయితే ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుండి ఇది రీమేక్ అని మార్పులు చేర్పులు చేస్తున్నారు అనే టాక్ వస్తూనే ఉంది.అయితే తాజాగా ఈ వార్తలపై హరీష్ శంకర్ ఖండించారు.

ఈ రీమేక్ అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిపాడు.రీమేక్ సినిమానా లేక ఆ రీమేక్ లో మార్పులు నిజం కాదు అని చెప్పారా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.దీంతో అయితే ప్రస్తుతం పవన్ ఫ్యాన్స్ కు కొద్దిగా క్లారిటీ వచ్చిందనే చెప్పాలి.ఇక ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా.మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.







