యాంకర్:రాష్ట్రంలో ప్రాథమిక వైద్యాన్ని బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని వైద్యారోగ్యాశాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు.అందులో భాగంగానే బస్తి,పల్లె దవాఖానాలను ఏర్పాటు చేసి అనుభవైజ్ఞులైన వైద్యులను,సిబ్బందిని అందుబాటులో ఉంచినట్లు మంత్రి పేర్కొన్నారు.
హైద్రాబాద్,నారాయణ గుడాలోని శ్వాస ఆసుపత్రి 25సంవత్సరాల సిల్వేర్ జూబ్లీ ఉత్సవాలలో మంత్రి పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….
సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు వైద్యాన్ని మరింత చేరువ చేయడానికి ప్రాథమిక దశలో పల్లె, బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తున్నాం అని అన్నారు.హైద్రాబాద్ లో తెలంగాణ డయాగ్నొస్టిక్ ద్వారా 57 రకాల ఉచిత పరీక్షలు చేస్తున్నాం అని, 350 బస్తీ దవాఖనల సేవలు చేరువ అయిన తర్వాత ఫీవర్, ఉస్మానియ, ఇతర ఆసుపత్రుల్లో ఓపీ కి వచ్చే వారి సంఖ్య తగ్గిందని తెలియజేశారు.
గ్రామాల్లో సేవల కోసం పల్లె దవాఖానలు ఏర్పాటు చేస్తున్నాం అని బీపీ షుగర్ పరీక్షలు నిర్వహిస్తూ మందులు అందిస్తున్నాం అని చెప్పారు.ప్రైవేట్ ఆసుపత్రులు అంటే వ్యాపార దృక్పథం అనే భావన ప్రజల్లో ఉన్నదని….కానీ శ్వాస ఆసుపత్రి సేవాదృక్పదంతో సేవలు అందించడం అభినందనీయం అని హరీష్ రావు అన్నారు.25సంవత్సరాల సిల్వెర్జుబ్లీ సెలెబ్రేషన్స్ జరుపుకుంటున్న ఆసుపత్రి యాజమాన్యానికి,సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు.







