Harirama Jogaiah : పవన్ నన్ను అపార్థం చేసుకున్నారు అంటున్న హరి రామ జోగయ్య..!!

కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకులు చేగుండి హరి రామ జోగయ్య( Harirama Jogaiah ) అందరికీ సుపరిచితులే.

ఏపీ రాజకీయాలలో గత కొద్ది నెలల నుండి వరుస పెట్టి లేఖలు రాస్తూ.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి పలు సూచనలు చేస్తున్నారు.ఈ క్రమంలో తాజాగా శుక్రవారం కాపు సంక్షేమ సేనను రద్దు చేస్తున్నట్లు లేఖ రాయడం జరిగింది.

కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలని ఆనాడు సేనను రిజిస్ట్రేషన్ చేయించామన్నారు.పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) తో సహా కొంతమంది వ్యక్తులు జనసైనికులు తనను అపార్థం చేసుకుంటున్నారు అని లేఖలో పేర్కొన్నారు.

అనంతరం ఎన్నికలు అయ్యే వరకు కాపు సంక్షేమ శాఖ( Kapu Welfare Sena )ను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.ఇటీవల నేతలు, విమర్శలతో హరీ రామ జోగయ్యలో అసహనం, విరక్తి నెలకొంది.ఈ క్రమంలో కాపు సేన నుంచి తాత్కాలికంగా తప్పుకున్నట్లు స్పష్టం చేశారు.

Advertisement

అంతేకాదు కాపు సంక్షేమ శాఖ అనుబంధ కమిటీలు, వ్యక్తుల హోదాలు కూడా రద్దు చేసినట్లు పేర్కొన్నారు.ఎన్నికల తర్వాత అప్పటి పరిస్థితులు బట్టి కొత్త కమిటీ వేస్తామని పేర్కొన్నారు.

అప్పటివరకు తాను కూడా రాజకీయ విశ్లేషకుడిగా ఉంటానని చెప్పుకొచ్చారు.ఇదే లేఖలో యాచించే స్థాయి నుండే శాసించే స్థాయికి కాపులు ఎదగాలని కోరుకున్నాను.

అప్పట్లో అదే లక్ష్యంతో ప్రజారాజ్యంలో చేరాను.ఆ పార్టీ కాంగ్రెస్( Congress ) లో విలీనం కావడంతో నష్టపోయాం.

మళ్లీ అటువంటి నష్టం జరగకూడదు అని భావిస్తున్నట్లు లేఖలో హరి రామ జోగయ్య కీలక విషయాలు ప్రస్తావించారు.

బీఆర్ఎస్ కు మళ్లీ గుర్తుల టెన్షన్ !
Advertisement

తాజా వార్తలు