షాక్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకునిగా కెరీర్ ను ప్రారంభించారు హరీష్ శంకర్.రవితేజతో తెరకెక్కించిన షాక్ సినిమా అనుకున్న ఫలితాన్ని సాధించకపోవడంతో హరీష్ శంకర్ కు కొన్నేళ్ల పాటు దర్శకునిగా అవకాశాలు రాలేదు.
తరువాత మళ్లీ హీరో రవితేజకు మిరపకాయ్ సినిమా కథ చెప్పి ఒప్పించి ఆ సినిమాతో కమర్షియల్ సక్సెస్ అందుకున్నాడు హరీష్ శంకర్.ఆ సినిమా తరువాత పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన గబ్బర్ సింగ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్టైంది.
సుబ్రమణ్యం ఫర్ సేల్, దువ్వాడ జగన్నాథమ్, గద్దలకొండ గణేష్ సినిమాలతో దర్శకునిగా వరుస విజయాలతో దూసుకుపోతున్న హరీష్ శంకర్ తరువాత సినిమాను పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కించనున్నారు.గబ్బర్ సింగ్ కాంబో రిపీట్ కానుండటంతో పవన్ ఫ్యాన్స్ సైతం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథను హరీష్ శంకర్ సిద్ధం చేశారు.
అయితే తాజాగా ఒక దర్శకుని గురించి హరీష్ శంకర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఉప్పెన సినిమాతో డైరెక్టర్ గా అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న బుచ్చిబాబు ను చూసి తాను ఈర్ష్య పడుతున్నానని చెప్పారు.ఉప్పెన సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ అద్భుతమైన పాటలు ఇచ్చాడని అందువల్ల తనకు బుచ్చిబాబును చూస్తే ఈర్ష్య కలుగుతోందని హరీష్ శంకర్ సరదాగా ట్వీట్ చేశారు.
బుచ్చిబాబు ఆ కామెంట్లకు స్పందిస్తూ గబ్బర్ సింగ్ సినిమా పాటలు విడుదలైన సమయంలో తాను కూడా అదే విధంగా జెలసీ ఫీల్ అయ్యానని రిప్లై ఇవ్వగా దేవి శ్రీ ప్రసాద్ మీ ఈర్ష్యలో ఉన్న ప్రేమ బయటకు కనిపిస్తోందంటూ కామెంట్ చేశారు.సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమా ద్వారా హీరోగా పరిచయమవుతున్నారు.