టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ( Prashant Verma ) గురించి మనందరికీ తెలిసిందే.ప్రశాంత్ వర్మ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ తన స్థాయిని పెంచుకుంటూ అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు.
మొదట అ సినిమాతో మొదలైన ప్రశాంత్ వర్మ జర్నీ తాజాగా విడుదల అయినా హనుమాన్ మూవీ( Hanuman movie ) వరకు సక్సెస్ఫుల్గా సాగింది.కాగా తాజాగా ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన హనుమాన్ సినిమా జనవరి 12న నా సంక్రాంతి పండుగ కానుకగా విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకుంది.
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ఫుల్ గా ప్రదర్శితం అవుతూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
సంక్రాంతికి నాలుగు ఐదు సినిమాలు విడుదల కాగా అన్నింటిలోనూ హనుమాన్ సినిమా హవానే ఎక్కువగా కనిపిస్తోంది.ఇది ఇలా ఉంటే ఇండియా వైడ్ ప్రశాంత్ వర్మ పేరు మారుమోగుతోంది.ఇక మరోసారి తెలుగు దర్శకుడు పేరు దేశమంతటా గొప్పగా వినిపిస్తుండడంతో తెలుగు వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు భాషతో సంబంధం ఉన్నవారే అంతలా సంతోష పడుతుంటే, మరి ప్రశాంత్ వర్మతో తండ్రి సంబంధం ఉన్న వ్యక్తి ఇంకెంత సంతోష పడతారు.తాజాగా ప్రశాంత్ వర్మ తండ్రికి సంబంధించిన ఒక వీడియో వైరల్ అవ్వడంతో అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
థియేటర్ లో సినిమా చూసి వస్తున్న ఒక వ్యక్తిని మీడియా వారు ప్రశాంత్ వర్మ తండ్రి అని తెలియక సినిమా ఎలా ఉందని రివ్యూ అడిగారు.ఆ ప్రశ్నకు ఆయన బదులిస్తూ.తీసినోడు నా కొడుకు అంటూ పుత్రోత్సాహంతో చెప్పుకున్నారు.ఆయన ముఖంలో సంతోషం వెలిగిపోతోంది.కొడుకు అంత మంచి గొప్ప సినిమా తీసినందుకు ఆయన పట్టరాని సంతోషంతో కనిపించారు.కాగా అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పలువురు ఆ వీడియోని షేర్ చేస్తూ ప్రశాంత వర్మ ని ట్యాగ్ చేస్తున్నారు.
మీరు ఇలాగే ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలి బ్రో అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.