చంద్రబాబు అరెస్టు ( Chandrababu arrest )తదనంతర పరిణామాలతో ఒక సారిగా బారీ కుదుపునకు లోనైన టిడిపి ఇప్పుడిప్పుడే కుదురుకుంటుంది .జరుగుతున్న రాజకీయ పరిణామాలను నిశితం గా పరిశీలిస్తున్న ఆ పార్టీ ఇప్పుడు ప్రత్యామ్నాయం రాజకీయ వ్యూహాలను అమలు చేయడానికి నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది.
ముఖ్యంగా చంద్రబాబు అరెస్ట్ తర్వాత సంఘీభావ దీక్షల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను చేస్తున్న టిడిపి ఇప్పుడు బాబు విడుదల వ్యవహారం చట్ట ప్రకారం సుదీర్ఘకాలం పట్టే అవకాశం ఉందని అంచనాకొచ్చినట్టుగా తెలుస్తుంది.ముఖ్యంగా నిన్న చంద్రబాబుతో ములాకత్ అయిన భువనేశ్వరి నారా లోకేష్( Nara Lokesh ) తో చంద్రబాబుతో సుదీర్ఘంగా చర్చించినట్లుగా తెలుస్తుంది.
ముఖ్యంగా న్యాయస్థానాలలో తీర్పులు మరింత ఆలస్యం అవుతాయన్న అంచనాకొచ్చిన చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లాలని, అధికార పార్టీ వైఫల్యాలను, రాజకీయ కక్ష సాధింపు దొరణి ని ప్రజల్లో ఎండగట్టాలని చెప్పినట్లుగా తెలుస్తుంది.ఉన్న కొద్ది సమయాన్ని తెలివిగా ఉపయోగించు కోవాలని పార్టీ కార్యక్రమాలను వేగవంతం చేసి ఎన్నికలకు సిద్దం అవ్వాలని ఆదేశించినట్టుగా తెలుస్తుంది .

అందువల్లే బాబు ని కలసి బయటకు వచ్చిన వెంటనే “నిజం గెలవాలి” పేరుతో రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుడుతున్నట్టుగా నారా భువనేశ్వరి ప్రకటించారు.మరోవైపు చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఆగిపోయిన భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని ఇక నారా లోకేష్( Nara Lokesh ) కొనసాగిస్తారని తెలుస్తుంది.యువగలం పాదయాత్ర కూడా మధ్యలో ఆగిపోయినప్పటికీ ,తరచూ ఢిల్లీకి న్యాయ సమీక్షలకు వెళ్లాల్సి రావడం వివిద వర్గాలతో సమన్వయం చేసుకోవలసిన పరిస్థితులలో యువగళం పాదయాత్ర ను ఇప్పుడు కొనసాగించడం కష్టమని భావిస్తున్న టిడిపి చంద్రబాబు బయటకు వచ్చిన తర్వాత కొనసాగించే ఉద్దేశంలో ఉన్నట్లుగా తెలుస్తుంది.

అప్పటివరకు ప్రజలలో వివిధ కార్యక్రమాల ద్వారా టిడిపి( TDP ) వాణి ని వినిపించడానికి పార్టీ సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది.ఎన్నికల దశలోకి ప్రవేశించడంతో ఒకవైపు చంద్రబాబు విడుదల కోసం ప్రయత్నిస్తూనే మరోవైపు పార్టీ కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకు వెళ్లాల్సిన బాధ్యత ఉన్నందున ఇక పార్టీ కార్యక్రమాలను వేగవంతం చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది.చంద్రబాబు కూడా దానికి తగిన సూచనలు ఇచ్చారని ఇక జనసేనతో కలిసి ఉమ్మడి కార్యాచరణను వేగవంతం చేసే ప్రయత్నాలను చేయమని ఆదేశించినట్లుగా తెలుస్తుంది .ఇకపై ఎన్నికల కేంద్రంగా టిడిపి గేర్ మారుస్తుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి.