తుక్కుగూడ భారీ బహిరంగ సభా వేదికగా కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ హామీలపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
కాంగ్రెస్ అర్ధ శతాబ్దపు పాలన అంతా మోసం, వంచన, ద్రోహమని మంత్రి కేటీఆర్ ఆరోపించారు.
రాబందుల రాజ్యం వస్తే రైతుబంధు రద్దు అవడం ఖాయమని చెప్పారు.స్కాముల పార్టీకి స్వాగతం చెప్తే స్కీమ్ లు ఎత్తేయడం గ్యారెంటీ అంటూ సెటైర్లు వేశారు.
మూడు రంగుల ఊసరవెల్లిని నమ్మితే మూడు గంటల కరెంటే గతి అన్నారు.అయితే ఇది.మీ కపట కథలు తెలిసిన తెలివైన తెలంగాణ గడ్డ.! అని ట్వీట్ లో పేర్కొన్నారు.
ఈ క్రమంలో ఇక్కడ మీ కల్లబొల్లి గ్యారెంటీలు చెల్లవని స్పష్టం చేశారు.