నల్గొండలోని తన నివాసంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియా సమావేశం.ఏడాది కాలంగా తెలంగాణలో జరుగుతున్న పరిణామాల వెనుక సమైక్యవాదుల కుట్రలు ఉన్నాయి.
కేసీఆర్ ను మానసికంగా దెబ్బ కొట్టేందుకు మూకుమ్మడిగా దాడి చేస్తున్నారు.ఏపీలో చేతకాక తెలంగాణలో ప్రజలను మభ్య పెట్టి కెసిఆర్ ను అడ్డు తొలగించు కోవాలని మళ్ళీ కబ్జా చేసేందుకు వస్తున్నారు.
2014మోడీ అధికారంలోకి వచ్చాక ఏడు మండలాలు ఏపీలో కలిపారు.దేశంలో ప్రభుత్వాలను కూల్చేకుట్రలు, అనిశ్చితకరమైన వాతావరణం ఉంది, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
అవినీతికి పాల్పడి జైలుకు వెళ్లడమే కాకుండా ఐఏఎస్ అధికారులను సైతం జైలుకు పంపిన చరిత్ర వారిది.