సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh Babu ) సర్కారు వారి పాట తర్వాత మరో సినిమాను స్టార్ట్ చేసి ఫినిష్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు.మహేష్ లేటెస్ట్ గా నటిస్తున్న భారీ మాస్ యాక్షన్ మూవీ ”గుంటూరు కారం’‘( Guntur Karam ).
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే బోలెడన్ని అంచనాలు పెరిగాయి.త్రివిక్రమ్ కూడా మంచి ఫామ్ లో ఉండడంతో ఈ సినిమా పక్క బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ సైతం ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఈ అంచనాలను నిజం చేస్తూ ఈ సినిమా పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కక పోయిన ఆ రేంజ్ లో బిజినెస్ చేసింది.తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా భారీ బిజినెస్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.
కాగా ప్రస్తుతం ఈ సినిమా షూట్ లాస్ట్ స్టేజ్ లో ఉంది.చిన్న చిన్న ప్యాచ్ వర్కులతో పాటు స్పెషల్ సాంగ్ షూట్ బ్యాలెన్స్ ఉన్నట్టు తెలుస్తుంది.అవన్నీ ఈ నెల 25 లోపులోనే పూర్తి చేయాలని పట్టుదలగా కృషి చేస్తున్నారు.కాగా ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ గురించి ఇప్పుడొక ఇంట్రెస్టింగ్ వార్త వైరల్ అవుతుంది.
ఈ స్పెషల్ సాంగ్ కోసం ఇంకా హీరోయిన్ ను ఫిక్స్ చేయలేదు కానీ స్టార్ హీరోయిన్ అయితే ఆడిపాడబోతున్నట్టు సమాచారం.ఇక ఈమెతో పాటు మహేష్ శ్రీలీల, మీనాక్షిచౌదరితో కూడా ఆడిపోయే స్టెప్స్ వేయనున్నట్టు టాక్.ఇలా మొత్తంగా మహేష్ ఈ సాంగ్ లో ముగ్గురు హీరోయిన్స్ తో క్రేజీ స్టెప్స్ వేయబోతున్నారన్నమాట…
చూస్తుంటే త్రివిక్రమ్ మార్క్ లో ఈ సాంగ్ ఉండబోతున్నట్టే అనిపిస్తుంది.కాగా ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి ( SreeLeela Meenakshi Chaudhary )హీరోయిన్ లుగా నటిస్తుండగా జగపతి బాబు( Jagapathi babu ) విలన్ గా కనిపిస్తున్నాడు.ఇక హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది.