ఖలిస్తాన్ వేర్పాటువాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్( Hardeep Singh Nijjar ) స్నేహితుడి ఇంటిపై కాల్పులు జరిగిన ఘటన కెనడాలో కలకలం రేపుతోంది.దీనిపై కెనడియన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లుగా స్ధానిక మీడియా నివేదించింది.154వ స్ట్రీట్‌లోని 2800 బ్లాక్‌కు సమీపంలో వున్న ఇంటిలో గురువారం స్థానిక కాలమానం ప్రకారం 1.20 గంటల సమయంలో చోటు చేసుకున్న తుపాకీ కాల్పులపై స్పందించినట్లు సర్రే రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు( Surrey Royal Canadian Mounted Police ) తెలిపారు.ఈ మేరకు కెనడియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పోరేషన్ (సీబీసీ) నివేదించింది.
బ్రిటీష్ కొలంబియా గురుద్వారాస్ కౌన్సిల్ ప్రతినిధి మాట్లాడుతూ.
ఈ ఇల్లు సిమ్రంజీత్ సింగ్‌కు( Simranjeet Singh ) చెందినదని అతను గతేడాది హత్యకు గురైన హర్దీప్ సింగ్ నిజ్జర్ స్నేహితుడని చెప్పారు.కార్పోరల్ సర్బ్‌జిత్ సంఘా మాట్లాడుతూ అధికారులు ఆ ప్రాంతంలోనే మకాం వేసి.
స్థానికులతోనూ సాక్షులతోనూ మాట్లాడారని గురువారం నాటి కాల్పుల గురించి మరింత తెలుసుకోవడానికి సీసీటీవీ ఫుటేజీని సమీక్షిస్తున్నారని చెప్పారు.ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని సంఘా తెలిపారు.

ఈ ప్రాంతంలో తుపాకీ కాల్పుల వల్ల కారు దెబ్బతిన్నదని.ఇంట్లో పలు బుల్లెట్ రంధ్రాలు కనిపించాయని సీబీసీ న్యూస్ తెలిపింది.విచారణ ఇంకా ప్రారంభదశలో వుందని, కాల్పుల వెనుక ఎవరున్నారనే దానిపై పలు కోణాల్లో ఆరా తీస్తున్నట్లు చెప్పారు.బ్రిటీష్ కొలంబియా గురుద్వారాస్ కౌన్సిల్ ప్రతినిధి మోనీందర్ సింగ్( Moninder Singh ) మాట్లాడుతూ.
నిజ్జర్‌తో ఇంటి యజమాని సిమ్రంజీత్ సింగ్‌కు వున్న సంబంధమే కాల్పులకు కారణమై వుండొచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు.జనవరి 26న వాంకోవర్‌లోని భారత కాన్సులేట్( India Consulate ) వద్ద ఖలిస్తాన్ అనుకూల నిరసనను నిర్వహించిన కొద్దిరోజులకే సిమ్రంజీత్ ఇంటిపై కాల్పులు జరిపారని మోనీందర్ సింగ్ తెలిపారు.

నిజ్జర్ హత్యతో ప్రస్తుతం భారత్, కెనడా మధ్య ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్న సంగతి తెలిసిందే.నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తం వుండొచ్చన్న కెనడియన్ ప్రధాని జస్టిన్ ట్రూడో( Canada PM Justin Trudeau ) వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర దుమారం రేపుతున్నాయి.ఇరు దేశాలు ఇప్పటికే దౌత్యవేత్తలను బహిష్కరించాయి.అయితే కెనడాలో వుంటున్న సిక్కుయేతర మతస్తులు ఎప్పుడేం జరుగుతుందోనని భయాందోళనలకు గురవుతున్నారు.







