కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటీవల బయటకు వచ్చిన సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ నేడు తన సొంత రాజకీయ పార్టీని ప్రకటించనున్నారు.జమ్మూకశ్మీర్ లో పార్టీ తొలి యూనిట్ ను ప్రకటిస్తారు.
మరికాసేపట్లో జమ్మూకు వెళ్లనున్న ఆయనకు విమానాశ్రయంలో మద్ధతుదారులు ఘన స్వాగతం పలకనున్నారు.అక్కడ నుంచి సైనిక్ ఫామ్స్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ఆయన హాజరుకానున్నారు.
ఆ సభలోనే ఆజాద్ తన జాతీయ స్థాయి పార్టీని ప్రకటిస్తారు.
అయితే, ఆజాద్ కు మద్ధుతగా జమ్మూకశ్మీర్ కాంగ్రెస్ యూనిట్ లోని పలువురు నేతలు ఇప్పటికే రాజీనామా చేశారు.
తాజాగా మాజీ ఎమ్మెల్యే అశోక్ శర్మ పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి లేఖ రాశారు.